పాకిస్తాన్ క్రికెట్ జట్టు అంటేనే నిలకడలేమికి మారుపేరు. ఆ జట్టులో స్టార్ క్రికెటర్లు ఉన్నా అది కాగితాలకే పరిమితం అవుతుందనే విషయం మరోసారి రుజువైంది. వన్డే వరల్డ్‌కప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాకిస్తాన్ 105 పరుగులకే కుప్పకూలింది. ఏ దశలోనే విండీస్ పేస్ బౌలింగ్ ఎటాక్‌ను ఎదుర్కోలేక మూడంకెల స్కోరును దాటడానికి అష్టకష్టాలు పడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ ఇమాముల్ హక్(2) ఇలా వచ్చి అలా పెవిలియన్ చేరాడు. దాంతో 17 పరుగులకే పాకిస్తాన్ తొలి వికెట్‌ను కోల్పోయింది.
పాకిస్తాన్ 105 పరుగులకే ఆలౌట్
May 31 2019 6:08 PM | Updated on Mar 21 2024 8:18 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement