హోదా.. అసెంబ్లీలో అనూహ్య తీర్మానం! | AP Govt resolution on Special Status in Assembly | Sakshi
Sakshi News home page

హోదా.. అసెంబ్లీలో అనూహ్య తీర్మానం!

Mar 13 2018 6:54 PM | Updated on Mar 22 2024 10:49 AM

ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రభుత్వం మరోసారి పిల్లిమొగ్గ వేసింది. గతంలో ప్రత్యేక హోదాకు బదులు ప్రత్యేక ప్యాకేజీ బాగుందంటూ.. ఏకంగా అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్రత్యేక హోదా కావాలంటూ అదే శాసనసభ వేదికగా మరోసారి తీర్మానం చేసింది. ప్రత్యేక హోదాతో సహా విభజన హామీలన్నింటినీ కేంద్ర ప్రభుత్వం నెరవేర్చాలని కోరుతూ మంగళవారం అసెంబ్లీలో ప్రభుత్వం తీర్మానం చేసింది. మరో ఏడాదిలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఏపీకి ప్రత్యేక హోదా  ఇవ్వాల్సిందేనని ప్రధాన ప్రతిపక్షం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తన పోరాటాన్న ముమ్మరం చేసిన తరుణంలో చంద్రబాబు సర్కారు హోదాపై ఈమేరకు యూటర్న్‌ తీసుకుంది

Advertisement
 
Advertisement
Advertisement