రెండేళ్ల బుడ్డోడు.. ఇలా హీరో అయ్యాడు! | two year kid Brock Shoff saves his twin brother video goes viral | Sakshi
Sakshi News home page

Jan 4 2017 10:34 AM | Updated on Mar 21 2024 9:55 AM

ఓ రెండేళ్ల అమెరికా బుడ్డోడు రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. తన కవల సోదరుడిని రక్షించేందుకు చేసిన ప్రయత్నం అందర్నీ ఆకట్టుకుంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఉతాలోని ఒరెమ్ సిటీకి చెందిన కేళీ షాఫ్ దంపతులకు సంతానం ఇద్దరు కవలలు. వారి పేర్లు బౌడీ షాఫ్, బ్రాక్ షాఫ్. అయితే గత శుక్రవారం వీరిద్దరూ ఇంట్లో సరదాగా అడుకుంటున్నారు. ఇంతలో వీరికి ఓ చిక్కు వచ్చి పడింది. వీరు ఆడుకుంటుండగా డ్రెస్సింగ్ డేబుల్ వారిపై పడింది. అయితే బౌడీకి కాళ్లమీద పడటంతో వెంటనే ఎలాగోలాగ తప్పించుకున్నాడు. అప్పుడు మొదలైంది అసలు పోరాటం.. తాను తప్పించుకున్నాడు కానీ, సోదరుడు బ్రాక్ షాఫ్ బాడీపై ఆ టెబుల్ అలాగే ఉండిపోయింది. దీంతో టేబుల్ కింద నానా తిప్పలు పడ్డాడు.

Advertisement
Advertisement