రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి | Sakshi
Sakshi News home page

రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి

Published Sun, May 26 2024 4:20 AM

రాకేశ్‌రెడ్డిని గెలిపించాలి

సాక్షి,యాదాద్రి: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగుల రాకేష్‌రెడ్డిని గెలిపించాలని ఆ పార్టీ నాయకుడు చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్‌చార్జ్‌ ఇబ్రహీం కోరారు. శనివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. సమస్యలపై అవగాహన కలిగి ప్రభుత్వాన్ని ప్రశ్నించే రాకేష్‌రెడ్డి కావాలా.. ప్రభుత్వానికి డబ్బా కొట్టే వ్యక్తి కావాలా అని ఓటర్లు ఆలోచించాలన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరు నెలల్లో విఫల ప్రభుత్వంగా మారిందని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న ప్రైవేట్‌, ఇంటర్‌, డిగ్రీ కళాశాలల స్కాలర్‌షిప్‌ ఫీజు రీయింబర్స్‌మెంట్‌, నిరుద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం రాకేష్‌రెడ్డి ప్రధాన పాత్ర పోషిస్తారని, పట్టభద్రులు భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. సమావేశంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ ఎనబోయిన ఆంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు ఏవీ కిరణ్‌, రచ్చ శ్రీనివాస్‌ రెడ్డి, బబ్లు, పుట్ట వీరేశ్‌యాదవ్‌, కుతాడి సురేష్‌, ఓంప్రకాశ్‌ పాల్గొన్నారు.

బీఆర్‌ఎస్‌ నాయకుడు

చింతల వెంకటేశ్వర్‌రెడ్డి

Advertisement
 
Advertisement
 
Advertisement