ఐదు నెలల్లోనే అపఖ్యాతి | Sakshi
Sakshi News home page

ఐదు నెలల్లోనే అపఖ్యాతి

Published Sat, May 25 2024 2:45 PM

ఐదు న

కేసీఆర్‌ వల్లే తెలంగాణలో

అభివృద్ధి జరిగింది : జగదీష్‌రెడ్డి

కేసీఆర్‌ వల్లే తెలంగాణలో అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు ఫ్లోరైడ్‌ నుంచి విముక్తి కల్పించేందుకు మిషన్‌ భగీరథకు రూపకల్పన, పరిశ్రమలు తీసుకురావడం, తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి మాత్రం కేటీఆరేనని పేర్కొన్నారు. పరిశ్రమల ద్వారా 20 లక్షల ఉద్యోగాలు కల్పించారని, సంక్షోభంలో ఉన్న చేనేత పరిశ్రమను గట్టెక్కించేందుకు అనేక పథకాలు తీసుకువచ్చారని గుర్తు చేశారు. హామీలను అమలు చేయకుండా తప్పించుకు తిరుగుతున్న కాంగ్రెస్‌ పెద్దలను గల్ల పట్టుకొని నిలదీయాలంటే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాఖేష్‌రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.

చౌటుప్పల్‌ : కాంగ్రెస్‌ పార్టీ ఆచరణకు సాధ్యంకాని హామీలతో అధికారంలోకి వచ్చిందని, వాటిని అమలు చేయకపోవడంతో ప్రజలు చీదరించుకుంటున్నారని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. ప్రభుత్వం ఐదు నెలల్లోనే అపఖ్యాతి మూటగట్టుకుందన్నారు. వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం చౌటుప్పల్‌ మండలం దామెర గ్రామంలోని ఫంక్షన్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన మునుగోడు నియోజకవర్గ సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీల్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా మరే హామీ కూడా అమలు కాలేదన్నారు. బస్సుల్లో ఆడవాళ్లు కొట్టుకుంటుండగా, మగవారు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎవ్వరు కూడా రాష్ట్రం పరువుకు భంగం కలిగించరని, రేవంత్‌రెడ్డి మాత్రం తెలంగాణ అప్పుల్లో ఉందని ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. సెక్రటేరియట్‌లో లంకెబిందెలున్నాయని వస్తే ఖాళీ కుండలు ఉన్నాయని వ్యాఖ్యలు చేసిన వ్యక్తి కూడా ముఖ్యమంత్రేనా? అని ప్రశ్నించారు. యాదాద్రి క్షేత్రం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా ఉండేలా తీర్చిదిద్దారని, వెయ్యి గ్రామాల్లో ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమివేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఎన్ని పార్టీలు మారిండో అందరికీ తెలుసన్నారు. రాజగోపాల్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ఇద్దరూ ఏ రకంగా బూతులు తిట్టుకున్నారో కూడా గుర్తుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు ఉండాలంటే ఉన్నత విద్యావంతుడైన రాఖేష్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్మన్‌ సందీప్‌రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌, మాజీ ఎమ్మెల్యేలు అంజయ్యయాదవ్‌, గాదరి కిశోర్‌, సూర్యాపేట జెడ్పీ వైస్‌ చైర్మన్‌ వెంకటనారాయణ, సీనియర్‌ నాయకులు మునగాల నారాయణరావు, చెరుకు సుధాకర్‌, పల్లె రవికుమార్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ చింతల దామోదర్‌రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గిర్కటి నిరంజన్‌, మార్కెట్‌ మాజీచైర్మన్‌ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సుర్వి యాదయ్య, గుండెబో యిన అయోధ్య, వెంకటేశం, ఢిల్లీ మాధవరెడ్డి, ఊడుగు మల్లేష్‌, సుర్వి మల్లేశం, దయాకరాచారి, కృష్ణ పాల్గొన్నారు.

ఫ బస్సుల్లో ఉచిత ప్రయాణం మినహా అన్నింటిలో విఫలం

ఫ ఫ్లోరైడ్‌ భూతాన్ని తరిమినఘనత బీఆర్‌ఎస్‌దే

ఫ యాదాద్రి ఆలయం వెయ్యేళ్లు చెక్కుచెదరకుండా తీర్చిదిద్దాం

ఫ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

ఐదు నెలల్లోనే అపఖ్యాతి
1/1

ఐదు నెలల్లోనే అపఖ్యాతి

Advertisement
 
Advertisement
 
Advertisement