ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ట్యాంకర్‌ బోల్తా

Published Sun, Nov 19 2023 1:58 AM

-

బీబీనగర్‌: హైదరాబాద్‌ నుంచి భువనగిరి వైపు వెళ్తున్న ఆయిల్‌ ట్యాంకర్‌ శనివారం బీబీనగర్‌ మండల కేంద్రంలో వరంగల్‌–హైదరాబాద్‌ హైవేపై అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. ట్యాంకర్‌ రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వాహనాలను సర్వీస్‌ రోడ్డు గుండా మళ్లించారు. అనంతరం భారీ క్రేన్‌ సహాయంతో లారీని రోడ్డు పక్కకు తరలించారు. రోడ్డుపై పడిన ఆయిల్‌ను శుభ్రం చేయించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement