కడియం వద్దు.. రాజయ్యే ముద్దు | - | Sakshi
Sakshi News home page

కడియం వద్దు.. రాజయ్యే ముద్దు

Sep 4 2023 1:32 AM | Updated on Sep 10 2023 3:20 PM

- - Sakshi

స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్‌ వరంగల్‌

మడికొండ: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ప్రకటించడాన్ని నిరసిస్తూ ఆదివారం గ్రేటర్‌ వరంగల్‌ పరిధి 46వ డివిజన్‌ రాంపూర్‌లో అంబేడ్క ర్‌ సంఘం ఆధ్వర్యాన నిరసన కార్యక్రమం చేపట్టారు. ‘కడియం వద్దు.. రాజయ్యే ముద్దు’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గానికి కడి యం ఏమీ చేయలేదని, రాజయ్య వచ్చాకే అభివృద్ధి జరిగింది అన్నారు.

విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన శ్రీహరి నియోజకవర్గానికి డిగ్రీ కళాశాల కూడా మంజూరు చేయించలేదని పేర్కొన్నారు. రాజయ్య పై లేనిపోని ఆరోపణలు చేసి టికెట్‌ తెచ్చుకున్న ఆయన మాదిగలను కాదని ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామన్నారు. ఎమ్మెల్యే రాజయ్య ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆయన వెంటే ఉంటామని, టికెట్‌ కెటాయిస్తే భారీ మోజార్టీతో గెలిపిచుకుంటా మని చెప్పారు.

అంతకు ముందు రాంపూర్‌ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టా రు. కార్యక్రమంలో మునిగాల వెంకటయ్య, డేని యల్‌, తప్పెట సారయ్య, కడారి దేవయ్య, మాదా సి రమేష్‌, యాదగిరి, నర్సింగం, కమలేష్‌, ఎంఆర్‌పీఎస్‌ జిల్లా కన్వీనర్‌ పట్ల మహేష్‌, ఎర్ర సంపత్‌, నాగేష్‌, వెంకటస్వామి, మీసాల ఎల్లేష్‌, సాగర్‌, ఎమ్మెల్యే అభిమానులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement