దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి
విశాఖ సిటీ: దివ్యాంగుల ఫిర్యాదులపై దృష్టి పెట్టి తక్షణమే వాటిని పరిష్కరించాలని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ పోలీస్ అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సమస్యల పరిష్కరానికి బుధవారం సాయంత్రం నిర్వహించిన ప్రత్యేక స్పందనలో భాగంగా దివ్యాంగ సురక్ష టోల్‌ఫ్రీ నెంబర్‌కు నలుగురు కాలర్స్ ఫోన్ చేశారు. సైన్ లాంగ్వేజ్ తెలిసిన నిపుణురాలిని అందుబాటులో ఉంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ఇద్దరు ఇతర రాష్ట్రాల నుంచి ఫోన్ చేసి సీపీకి తన సమస్యలు విన్నవించుకున్నారు. వీటిపై తక్షణమే సంబంధిత ప్రాంతాల అధికారులకు ఈ సమస్యలను రాత పూర్వకంగా పోస్టల్, వాట్సప్ ద్వారా అందజేసి, సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకోవాలని దిశా దివ్యాంగ సురక్ష కంట్రోల్, ఇతర సిబ్బందిని పర్యవేక్షించడానికి ప్రత్యేకంగా నియమించిన ఇన్స్పెక్టర్ను సీపీ ఆదేశించారు. గత సారి నిర్వహించిన ఈ కార్యక్రమానికి వచ్చిన 8 ఫిర్యాదుల్లో ఆరింటిని పరిష్కరించారు. మరో రెండు కూడా పరిష్కార దశలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment