బీచ్‌రోడ్డులో పరిశుభ్రతా పనులు చేపట్టండి | Sakshi
Sakshi News home page

బీచ్‌రోడ్డులో పరిశుభ్రతా పనులు చేపట్టండి

Published Fri, Dec 1 2023 1:00 AM

అధికారులతో మాట్లాడుతున్న కమిషనర్‌ సాయికాంత్‌వర్మ  - Sakshi

డాబాగార్డెన్స్‌: బీచ్‌రోడ్డులో ఈ నెల 4న నిర్వహించనున్న నేవీ డే వేడుకల్లో భాగంగా అవసరమైన విద్యుత్‌ దీపాలు, పరిశుభ్రత పనులు చేపట్టాలని జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ అధికారులను ఆదేశించారు. ఆర్కే బీచ్‌లో నేవీ డే ఉత్సవాల ఏర్పాట్లను కమిషనర్‌ గురువారం అధికారులతో కలిసి పరిశీలించారు. నేవీ డే ఉత్సవాలకు రానున్న సందర్శకుల వాహనాల పార్కింగ్‌కు వీలుగా దసపల్లా గ్రౌండ్‌, ఏపీఐఐసీ గ్రౌండ్‌, విశ్వప్రియ ఫంక్షన్‌ హాల్‌, ఏయూ హైస్కూల్‌ వద్ద భవన నిర్మాణ వ్యర్థాలు తొలగించి పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, తాత్కాలికంగా విద్యుత్‌ దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. నౌరోజీరోడ్డులో విద్యుత్‌ అలంకరణ పనులు చేపట్టాలన్నారు. బీచ్‌రోడ్డులో ఏర్పా టు చేసిన ఎంక్లోజర్స్‌ వద్ద తాగునీరు, టాయ్‌లెట్లను, అందమైన మొక్కలు ఏర్పాటు చేయడానికి ఒక లేఅవుట్‌ మ్యాప్‌ సిద్ధం చేయమని సీసీపీ సురేష్‌ను ఆదేశించారు. రోడ్లలో చిన్న చిన్న పాత్‌హోల్స్‌ను పూడ్చి వేయాలని చీఫ్‌ ఇంజనీర్‌ రవికృష్ణరాజును, రోడ్లలో ఎక్కడా వ్యర్థాలు లేకుండా పరిశుభ్ర పనులు చేపట్టాలని సీఎంఓహెచ్‌ డాక్టర్‌ నరేష్‌కుమార్‌ను ఆదేశించారు. అదనపు కమి షనర్‌ డాక్టర్‌ వై.శ్రీనివాసరావు, జోనల్‌ కమిషనర్‌ విజయలక్ష్మి, ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రత్నాకరెడ్డి, ఏసీపీలు రఘునాఽథ్‌, వినయ్‌కుమార్‌, ఏఎంవోహెచ్‌ సత్యనారాయణ పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement