జగమంత వెలుగు

- - Sakshi

ఏయూ మైదానంలో బాణసంచా విక్రయాలు

దీపావళి పండగను జరుపుకునేందుకు నగరం సిద్ధమైంది. దీపావళి అంటే ప్రతీ మదిలో మెదిలేది టపాసులు.. క్రాకర్స్‌.. చిచ్చుబుడ్డి వెలుగులు. గతంలో పిండి వంటలు చేసుకుని.. మట్టి దీపాలతో దివిటీలు తిప్పుడూ పండగ జరుపుకునేవారు. ఇవి ప్రకృతికి పెద్దగా నష్టం కలిగించేవి కాదు. నేటి మన జీవన విధానం.. పండగ చేసుకునే తీరు ప్రకృతి వనరులు, చిన్నారులు, వృద్ధులు, శ్వాసకోశ వ్యాధిగ్రస్తులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నో జాగ్రత్తలతో పండగ జరుపుకోవాల్సిన అవసరం ఏర్పడింది. వాయు కాలుష్యం హృదయ, శ్వాసకోశ వ్యాధులను తీవ్ర తరం చేస్తుంది. గుండె, ఊపిరితిత్తులపై ప్రభావితం చూపుతుంది. గుండెపోటుకు దారి తీసే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్తగా దీపావళి రోజు మాస్క్‌లు ధరించి టపాసులు కాల్చాలని వైద్యులు సూచిస్తున్నారు. పర్యావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకున్న కొన్ని సంస్థలు యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌లను విరివిగా విక్రయిస్తున్నాయి. బాణసంచా దుకాణాల్లో ఇవి లభిస్తున్నాయి.

టపాసులు కాల్చేటప్పుడు..

వినియోగదారులు నాణ్యమైన పటాసులు మాత్రమే కొనుగోలు చేయాలి.

పైకి ఎగిరే తారాజువ్వలను గడ్డికుప్పలు, పూరి గుడిసెలకు దూరంగా కాల్చాలి.

కాల్చేటప్పుడు చెప్పులు,బూట్లు ధరించాలి.

పెద్దల పర్యవేక్షణలో పిల్లలు బాణసంచా కాల్చడం ఉత్తమం.

సరిగ్గా కాలని వాటిని మళ్లీ వెలిగించడం, ఊదడం చేయకూడదు.

తక్కువ శబ్దం వచ్చే వాటిని ఎంచుకోవాలి.

పేలుడు పదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచాలి.

కాల్చేటప్పుడు నీటిని అందుబాటులో ఉంచుకోవాలి.

చేతిలో టపాసులు కాల్చడం, వెలిగించి విసిరి వేయడం వంటివి చేయకూడదు.

అగ్నిమాపక కేంద్రాల నంబర్లు

సూర్యాబాగ్‌, సిటీ 0891–2563582

బర్మాక్యాంపు, సిటీ 0891–2558470

పెదగంట్యాడ 0891–2517780

చిట్టివలస 08933–201337

అనకాపల్లి 08924–222299

యలమంచిలి 0891–231101

సబ్బవరం 08924–248799

నర్సీపట్నం 08932–235101

చోడవరం 08934–245199

మాడుగుల 08934–224211

పాడేరు 08935–250201

నక్కపల్లి 08931–227901

రావికమతం 08934–226111

అత్యవసర నంబర్లు

108: అగ్నిప్రమాదంలో ఎవరైనా గాయపడితే వెంటనే 108కు ఫోన్‌ చేయాలి. ప్రమాదం ఎక్కడ జరిగిందో లొకేషన్‌ వివరాలు స్పష్టంగా తెలియజేయాలి.

101: అగ్ని ప్రమాదం జరిగితే అగ్నిమాపక శాఖ కార్యాలయానికి సమాచారం అందించాలి.

100: అత్యవసర సమాచారం ఏదైనా డయల్‌ 100కు ఫోన్‌ చేసి తెలియజేయాలి.

దీపావళి అంటేనే వెలుగుల పండగ. అమావాస్య చీకట్లను చీల్చుతూ ఎటుచూసినా దీపాల సొబగులే. అంబరాన్నంటే సంబరాలే. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హిందువులంతా ఎంతో ఆనందోత్సాహాలతో చేసుకునే పండగతో ప్రతీ ఇల్లు కళకళలాడుతుంది. అయితే ఆ ప్రమోదం వెనకే ప్రమాదం పొంచి ఉందన్న విషయం గుర్తెరగరు. బాణసంచా కాల్చేటప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చూపినా పెను ప్రమాదాలకు ఆస్కారం ఉంటుంది. అవి మిగిల్చిన చేదు జ్ఞాపకాలు జీవితాంతం వెంటాడుతూనే ఉంటాయి. – డాబాగార్డెన్స్‌

ప్రమోదం.. కాకూడదు ప్రమాదం

కాలుష్యం నుంచి మాస్క్‌లతో రక్ష

వెలుగుల పండక్కి నగరం సిద్ధం

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top