జూలో ఘనంగా ఆడ తెల్లపులి పుట్టిన రోజు వేడుక
Sakshi News home page

జూలో ఘనంగా ఆడ తెల్లపులి పుట్టిన రోజు వేడుక

Aug 14 2023 1:26 AM | Updated on Aug 14 2023 8:45 AM

- - Sakshi

విశాఖపట్నం: ఇందిరా గాంధీ జూ పార్కులో పీచెస్‌ అనే ఆడ తెల్ల పులి పుట్టిన రోజు ఘనంగా జరిగింది. తెల్ల పులుల ఎన్‌క్లోజర్‌ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సీపీఈ జూనియర్‌ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. కొందరు విద్యార్థులు పులి మాస్క్‌లు ధరించి సందడి చేశారు. విద్యార్థులతో కలిసి క్యూరేటర్‌ నందనీ సలారియా కేకు కట్‌ చేసి సందర్శకులకు పంచిపెట్టారు.

సీపీఈ కళాశాల యాజమాన్యం ఆ పులిని నెల రోజుల పాటు దత్తత తీసుకుంది. పీచెస్‌ పుట్టి ఐదేళ్లు పూర్తయిందని, ఆరో సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పుట్టిన రోజు వేడుక నిర్వహించామని క్యూరేటర్‌ తెలిపారు. నెల రోజుల పాటు పీచెస్‌కు అయ్యే ఖర్చును భరించేందుకు ముందుకొచ్చిన సీపీఈ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. అసిస్టెంట్‌ క్యూరేటర్లు గోపి, గోపాలనాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement