146 | Sakshi
Sakshi News home page

146

Published Sat, Nov 11 2023 4:20 AM

వికారాబాద్‌లో నామినేషన్‌ దాఖలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ అభ్యర్థి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ - Sakshi

అభ్యర్థులు
నామినేషన్లు
89

వికారాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో మొదటి అంకం పూర్తయ్యింది. ఈ నెల 3వ తేదీ ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారంతో ముగిసింది. జిల్లాలోని వికారాబాద్‌, కొడంగల్‌, పరిగి, తాండూరు నియోజకవర్గాల్లో 89మంది అభ్యర్థులు 146 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. 13న నామినేషన్లను పరిశీలిస్తారు. 15వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు ఉంది. అదే రోజున తుది జాబితా వెల్లడి, గుర్తుల కేటాయింపు ఉంటుంది.బీ ఫాం కేటాయించిన పార్టీలకు ఆ పార్టీ గుర్తును కేటాయించనుండగా, స్వతంత్ర అభ్యర్థులకు పలు గుర్తులను కేటాయిస్తారు. ఈ నెల 30న పోలింగ్‌ జరుగుతుంది. నవంబర్‌ 3న కౌంటింగ్‌ నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో 89మంది అభ్యర్థులు, 146 సెట్ల నామినేషన్లను దాఖలు కాగా 2018 ఎన్నికల్లో 67 మంది అభ్యర్థులు, 132 సెట్ల నామినేషన్లు వేశారు.

అట్టహాసంగా..

నామినేషన్‌ కేంద్రాల వద్ద శుక్రవారం సందడి నెలకొంది. దరఖాస్తు చేసుకునేందుకు చివరి రోజు కావడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేశారు. వికారాబాద్‌ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి గడ్డం ప్రసాద్‌కుమార్‌, బీఆర్‌ఎస్‌ నుంచి డాక్టర్‌ మెతుకు ఆనంద్‌ చివరి రోజు మరో సెట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. తాండూరులో కాంగ్రెస్‌ అభ్యర్థి బుయ్యని మనోహర్‌రెడ్డి భారీ ర్యాలీగా వెళ్లి నామినేషన్‌ వేశారు. వివిధ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్‌ దాఖలు చేశారు.

నామినేషన్‌ వేసిన ప్రధాన పార్టీల

అభ్యర్థులు వీరే..

వికారాబాద్‌లో మెతుకు ఆనంద్‌(బీఆర్‌ఎస్‌), గడ్డం ప్రసాద్‌కుమార్‌(కాంగ్రెస్‌), పెద్దింటి నవీన్‌కుమార్‌(బీజేపీ), క్రాంతికుమార్‌(బీఎస్పీ) నామినేషన్లు దాఖలు చేశారు. తాండూరులో పైలెట్‌ రోహిత్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌), బుయ్యని మనోహర్‌రెడ్డి(కాంగ్రెస్‌), వేమూరి శంకర్‌గౌడ్‌(జనసేన) నామినేషన్‌ వేశారు. పరిగిలో కొప్పుల మహేశ్‌రెడ్డి (బీఆర్‌ఎస్‌),తమ్మన్నగారి రామ్మోహన్‌రెడ్డి(కాంగ్రెస్‌), బూనేటీ మారుతికిరణ్‌ (బీజేపీ) నామినేషన్‌ దాఖలు చేశారు. కొడంగల్‌లో పట్నం నరేందర్‌రెడ్డి(బీఆర్‌ఎస్‌) ఎనుముల రేవంత్‌రెడ్డి (కాంగ్రెస్‌), బంటు రమేశ్‌( బీజేపీ) నామినేషన్లు వేశారు. స్క్రూట్నీ, ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తరువాత ఎంత మంది అభ్యర్థులు బరిలో ఉంటారో తెలియనుంది.

నియోజకవర్గాల వారీగా నామినేషన్ల దాఖలు

నియోజకవర్గం అభ్యర్థుల సంఖ్య నామినేషన్లు

వికారాబాద్‌ 19 35

కొడంగల్‌ 16 26

తాండూరు 28 37

పరిగి 26 48

మొత్తం 89 146

ముగిసిన నామినేషన్ల ఘట్టం

చివరి రోజు కేంద్రాల వద్ద కోలాహలం

13న స్క్రూట్నీ

15వ తేదీ వరకు ఉపసంహరణకు గడువు

Advertisement
Advertisement