నటి దారుణ హత్య.. 13 ఏళ్ల తర్వాత దోషిని తేల్చిన కోర్టు | Actress Laila Khan Death Mystery Revealed | Sakshi
Sakshi News home page

Laila Khan: ఇన్నాళ్ల నటి మృతిపై విడిన మిస్టరీ.. కుటుంబం మొత్తాన్ని

May 10 2024 6:29 PM | Updated on May 11 2024 11:28 AM

Actress Laila Khan Death Mystery Revealed

దాదాపు 13 ఏళ్ల క్రితం కనిపించకుండా పోయిన ప్రముఖ నటి కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి. ఆమెని దారుణంగా హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది. ఈ క్రమంలోనే విచారణ పూర్తవగా.. తాజాగా కోర్టు తీర్పు ఇచ్చింది. సవతి తండ్రి ఈ దారుణానికి పాల్పడినట్లు తెలిసి అందరూ షాకవుతున్నారు. ఇంతకీ అసలేం జరిగింది?

1978లో ముంబయిలో పుట్టి పెరిగిన రేష్మా పటేల్.. సినిమాల్లోకి వచ్చేటప్పుడు లైలా ఖాన్ అని తన పేరు మార్చుకుంది. 2002లో కన్నడ మూవీతో హీరోయిన్ అయ్యింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినప్పటికీ రాజేశ్ ఖన్నాతో చేసిన 'వాఫా'.. ఈమెకు ఓ మాదిరి గుర్తింపు తీసుకొచ్చింది. 2011లో 'జిన్నాత్' అనే సినిమా చేస్తుండగా.. విరామం రావడంతో కుటుంబంతో కలిసి ట్రిప్‌కి వెళ్లింది. ఆ తర్వాత కనిపించకుండా పోయింది.

(ఇదీ చదవండి: రొమాంటిక్ సీన్స్.. నాకు ఒళ్లంతా దద్దుర్లు వచ్చేశాయి: టాలీవుడ్ హీరోయిన్)

దీంతో లైలా తండ్రి నాదిర్ పటేల్.. తన కుటుంబ సభ్యులు కనిపించట్లేదని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారణ మొదలుపెట్టారు. నటి మొబైల్ సిగ్నల్ చివరగా నాసిక్‌లో ఉన్నట్లు గుర్తించారు. లైలాకు అక్కడ ఫామ్ హౌస్ ఉందని తెలిసి పోలీసులు వెళ్లగా.. అది కాస్త కొంతవరకు అగ్ని ప్రమాదానికి గురై ఉంది. కొన్నాళ్ల తర్వాత జమ్ము కశ్మీర్‌లో వీళ్ల వాహనం దొరకడంతో కేసు క్లిష్టంగా మారింది. అయితే లైలాతో పాటు ఆమె కుటుంబ సభ్యుల ఆచూకీ మాత్రం దొరకలేదు.

లైలా సవతి తండ్రి పర్వేజ్ తక్‌పై ఎందుకో పోలీసులకు అనుమానమొచ్చింది. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఆస్తి విషయంలో గొడవ జరిగిందని.. దీంతో భార్య షెలీనాను చంపి ఆ తర్వాత లైలా-ఆమె అక్క అమీనా, కవలలు జారా-ఇమ్రాన్, కజిల్ రేష్మాని హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. ఆ తర్వాత బంగ్లా నుంచి కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాలని వెలికి తీశారు. మొత్తంగా 40 మందిని విచారించారు. ఈ క్రమంలోనే తాజాగా ముంబై సెషన్స్ కోర్టు.. పర్వేజ్‌ని ఈ కేసులో దోషిగా తేల్చింది. మే 14న శిక్ష ఖరారు చేయనుంది.

(ఇదీ చదవండి: 20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement