20 ఏళ్లకే పెళ్లి.. 'బిగ్‌బాస్' స్టార్ షాకింగ్ నిర్ణయం | Bigg Boss Fame Abdu Rozik Announced Wedding Date, Know About His Wife Details | Sakshi
Sakshi News home page

Abdu Rozik Marriage: ప్రేమించిన అమ్మాయితో సింగర్ పెళ్లి.. అదే స్పెషల్?

May 10 2024 2:26 PM | Updated on May 10 2024 3:18 PM

Bigg Boss Abdu Rozik Wedding And Wife Details

ప్రముఖ సింగర్ పెళ్లికి రెడీ అయ్యాడు. అది కూడా కేవలం 20 ఏళ్ల వయసులోనే చేసుకోనుండటంతో అందరూ షాక్ అవుతున్నారు. స్వతహాగా తజికిస్థాన్ సింగర్ అయిన అబ్దు రోజిక్.. హిందీలో బిగ్‌బాస్-16 షోలో పాల‍్గొని పాపులరిటీ సంపాదించాడు. తనదైన పాటలు, కామెడీ టైమింగ్‌తో బాగానే గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఇప్పుడు తను కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు చెప్పి అందరూ అవాక్కయ్యేలా చేశాడు.

(ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరో.. అమ్మాయి ఎవరంటే?)

20 ఏళ్ల అబ్దు రజాక్.. షార్జాకు చెందిన అమీరాతో జూలై 7న నిఖా(ముస్లిం పద్ధతిలో పెళ్లి) చేసుకోనున్నాడు. ఈమె అబ్దు కంటే ఏడాది చిన్నది. అయితే వీళ్లిద్దరిది ప్రేమ వివాహం అని తెలుస్తోంది. ఇతడు పెట్టిన ఇన్ స్టా వీడియో చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఇంతకీ వీడియో, క్యాప్షన్‌లో ఏముందంటే?

'ప్రేమ కంటే విలువైనది నా జీవితంలో ఇంకేది లేదు. పెళ్లికి రెడీ అయ్యాను. జీవితంలో ఇదో కొత్త ప్రయాణం. ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో ఎదురుచూస్తున్నాను. నాది ప్రేమ పెళ్లి. అయితే  ఈ ప్రేమ నాకు అంత సులభంగా దక్కలేదు. చాలా ఇబ్బందులు ఎదుర్కొని ఇంతవరకు వచ్చాను. లవ్ జర్నీ నాకు కాస్త సవాలుగానే అనిపించింది. అమీరా-నేను ఒకరిని ఒకరు ఇష్టపడ్డాం. అయితే ఇలా జరుగుతుందని మాత్రం ఎప్పుడూ ఊహించలేదు. జూలై 7వ తేదీని సేవ్ చేసుకోండి' అని అబ్దు తన సంతోషాన్ని పంచుకున్నాడు. 

(ఇదీ చదవండి: టాలీవుడ్‌లో అది చాలా కష్టం.. అసౌకర్యంగా అనిపిస్తుంది: సంయుక్త)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement