పేదల పెన్నిధి సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

పేదల పెన్నిధి సీఎం జగన్‌

Published Fri, Nov 17 2023 1:04 AM

- - Sakshi

తిరుపతి మంగళం: రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చిన నాలుగన్నరేళ్లలో అందించిన సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగులు నింపారని టీటీడీ చైర్మన్‌, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి కొనియాడారు. తిరుపతి నగర పరిధిలోని 10, 12 డివిజన్లలో గురువారం ఆయన ‘ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయా వార్డుల్లోని ఇంటింటికీ వెళ్లి ఆంధ్రప్రదేశ్‌కు జగనే ఎందుకు కావాలంటే అన్న విషయాన్ని ప్రజలకు క్షుణ్ణంగా వివరించారు. ఈ సందర్భంగా దౌవలత్‌ అనే స్థానిక ముస్లిం మహిళ మాట్లాడుతూ ‘జగనన్న లేకపోతే మాకు జీవితమే లేదన్నా. ఆ దేవుడు అందించిన సంక్షేమ పథకాలతోనే జీవిస్తున్నాం. జగనన్నను తప్ప మరొకరిని సీఎంగా ఊహించుకోలేం’అని తెలిపారు. ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి స్పందిస్తూ దేశ రాజకీయ చరిత్రలోనే ఏ నాయకుడూ నేరుగా సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు నగదు అందించిన దాఖలాలు లేరన్నారు. ప్రతి పేదవాడికీ నేనున్నానంటూ భరోసా కల్పించిన ఏకై క నాయకుడు సీఎం జగన్‌ అన్నారు. ప్రతి ఇంటా జగనన్న ఉన్నాడన్న భరోసా, ధైర్యంతో పేద ప్రజలు ఎంతో సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారు. పేద ప్రజలకు జగనన్న చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక అటు చంద్రబాబు, ఇటు పవన్‌కళ్యాణ్‌ ఆరోపణలు చేస్తూ విషం కక్కుతున్నారని మండిపడ్డారు. పేదల జీవితాలతో ఆడుకున్న చంద్రబాబుకు ఓట్లు వేస్తారో? ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పాలన సాగించిన జగనన్నకు ఓట్లు వేస్తారో? ప్రజలే నిర్ణయించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ సీనియర్‌ నాయకులు దొడ్డారెడ్డి సిద్ధారెడ్డి, క్లస్టర్‌ ఇన్‌చార్జులు ఆదం సుధాకర్‌రెడ్డి, పడమటి కుమార్‌, కార్పొరేషన్‌ స్టాండింగ్‌ కమిటీ సభ్యులు ఎస్‌కె.బాబు, ఎస్‌కె.జానీ, కార్పొరేటర్లు దొడ్డారెడ్డి ప్రవళ్లికారెడ్డి, దూది కుమారి, తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం అధ్యక్షుడు నల్లాని బాబు, జేసీఎస్‌ అధ్యక్షుడు దొడ్డారెడ్డి మురళీరెడ్డి, ఉదయగిరి రమేష్‌ పాల్గొన్నారు.

చంద్రబాబు పాలనంతా చీకటే

జగనన్న చేసే మంచిని చూసి

ఓర్వలేక విషం కక్కుతున్నారు

‘వై ఏపీ నీడ్స్‌ జగన్‌’ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి

Advertisement

తప్పక చదవండి

Advertisement