​​​​​​​తిరుపతిలో సీఎం కప్‌ పోటీలు | - | Sakshi
Sakshi News home page

​​​​​​​తిరుపతిలో సీఎం కప్‌ పోటీలు

May 1 2023 8:30 AM | Updated on May 1 2023 8:37 AM

- - Sakshi

తిరుపతి అర్బన్‌: తిరుపతి నగరంలో సోమవారం నుంచి ఈనెల 5వ తేదీ వరకు ఏపీ సీఎం కప్‌ టోర్నమెంట్‌ నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సంస్థ ముఖ్య కార్యనిర్వాహణాధికారి వి. మురళీకృష్ణ ఆదివారం పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి 4700 మంది క్రీడాకారులు హాజరుకానున్నారని పేర్కొన్నారు.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీతోపాటు పలు కళాశాలల్లోనూ పోటీలు నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఉదయం 8గంటల నుంచే క్రీడలు ప్రారంభమవుతాయని వివరించారు. ఆ మేరకు క్రీడాకారులకు అవసరం అయిన ఏర్పాట్లు చేశామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement