హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం | Rain In Many Places In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం

Jun 18 2026 9:41 PM | Updated on Jun 18 2026 9:58 PM

Rain In Many Places In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడి, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, ఖైరతాబాద్‌, పంజాగుట్ట, బేగంపేట, గచ్చిబౌలి, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీనగర్‌, వనస్థలిపురం, నాగోల్‌, బోయిన్‌పల్లి, తిరుమలగిరి ప్రాంతాల్లో వర్షం పడింది.

రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పలు చోట్ల ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. భారీ వర్షంతో జీహెచ్‌ఎంసీ అప్రమత్తమైంది. హైడ్రా, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement