Covid: యాంటీ వైరల్ ఔషధం మోల్నుపిరావిర్‌’.. ఒక్క మాత్ర రూ.63 | Sakshi
Sakshi News home page

Covid 19 Drug Molnupiravir: ‘మోల్నుపిరావిర్‌’.. ఒక్క మాత్ర రూ.63

Published Fri, Dec 31 2021 8:11 AM

Optimus Pharma Launches COVID Pill Molnupiravir, Check Price And Details - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ చికిత్సకు అద్భుతమైన ఔషధంగా పేర్కొంటున్న ‘మోల్నుపిరావిర్‌’ను ప్రముఖ ఔషధ దిగ్గజ సంస్థ ఆప్టిమస్‌ ఫార్మా గురువారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. బంజారాహిల్స్‌ హోటల్‌ పార్క్‌హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ ఎండీ శ్రీనివాసరెడ్డి వివరాలు వెల్లడించారు. మోల్నుపిరావిర్‌ 3 దశల్లో క్లినికల్‌ ట్రయల్స్‌ ముగించుకుని, ఇటీవలే డీసీజీఐ అనుమతి పొందిందన్నారు. 5 రోజుల్లోనే వైరస్‌లోడును పూర్తిగా అదుపులోకి తెస్తుందన్నారు.


మోల్ను పిరావిర్‌ టాబ్లెట్లను ఆవిష్కరిస్తున్న ఆప్టిమస్‌ ఫార్మా సీఎండీ డాక్టర్‌ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు 

ఒక్కో ప్యాకెట్‌లో 5 స్ట్రిప్‌లు ఉంటాయని, వీటిలో 40 మా త్రలు ఉంటాయన్నారు. ఒక్కో మాత్ర 200 ఎంజీ డోసుతో తయారైందని వెల్లడించారు. ఈ మాత్ర రోజుకు రెండు చొప్పున తీసుకోవాలని తెలిపారు. ఒక్కోమాత్ర ఖరీదు రూ.63 ఉంటుందని తెలిపారు. ఈ మందులు పూర్తిగా వైద్యుల పర్యవేక్షణలోనే వాడాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆప్టిమస్‌ ఫార్మా జీఎం శ్రీధర్, మేనేజర్‌ అంకూర్, డాక్టర్‌ ముఖర్జీ పాల్గొన్నారు. 
చదవండి: చాలా మంది అగ్ర సీఈవోల వేతనం ఒక డాలరే.. ఎందుకు?

Advertisement

తప్పక చదవండి

Advertisement