సంగీత ప్రియులను అలరించనున్న ‘జావేద్‌ అలీ’ | Javed Ali Live Music Concert at Prism | Sakshi
Sakshi News home page

సంగీత ప్రియులను అలరించనున్న ‘జావేద్‌ అలీ’

Jun 19 2024 7:50 AM | Updated on Jun 19 2024 7:50 AM

Javed Ali Live Music Concert at Prism

సాక్షి, హైదరాబాద్: ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ జావేద్‌ అలీ తన స్వరాలతో నగరవాసులను మంత్రముగ్ధులను చేయనున్నారు. వరల్డ్‌ మ్యూజిక్‌ డే ఫెస్టివల్‌లో భాగంగా ఈనెల 21న నగరంలోని ప్రిజంలో జావేద్‌ అలీ లైవ్‌ మ్యూజిక్‌ కాన్సర్ట్‌ను నిర్వహించనున్నారు. హంగామా డిజిటల్‌ మీడియా ఎంటర్‌టైన్మెంట్, స్కిల్‌బాక్స్‌ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మ్యూజిక్‌ షో రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుందని హంగామా డిజిటల్‌ మీడియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ సౌమిని పాల్‌ తెలిపారు.

 జోధా అక్బర్‌ ఫేమ్‌ ’జాష్‌్న–ఈ–బహారా’, పుష్ప...’శ్రీవల్లి’, బజరంగీ భాయిజాన్‌లోని ’తు జో మిలా’ వంటి హిట్‌ సాంగ్స్‌తో సంగీత ప్రియులను సమ్మోహనం పరచనున్నారని, కాన్సర్ట్‌ టికెట్లు స్కిల్‌బాక్స్‌లో అందుబాటులో ఉన్నాయని సౌమిని అన్నారు. ఈ కాన్సర్ట్‌కు సంబంధించి.. ‘ప్రత్యక్ష ప్రదర్శన ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉంటుందని, హైదరాబాదీ అభిమానులను అలరించడానికి ఇదొక మంచి అవకాశమని’ సింగర్‌ జావేద్‌ అలీ ఓ ప్రకటనలో తెలిపారు. అద్భుతమైన మ్యూజిక్‌ నైట్‌ కోసం తానూ ఎదురు చూస్తున్నానని అందులో వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
Advertisement