నిలోఫర్‌ అగ్నిప్రమాదంపై అధికారుల స్పందన | Fire Accident In Niloufer Hospital Hyderabad, Details Inside - Sakshi
Sakshi News home page

Niloufer Fire Accident: నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. సూపరింటెండెంట్ స్పందన

Feb 7 2024 5:37 PM | Updated on Feb 7 2024 6:19 PM

Fire Accident In Niloufer Hospital Hyderabad - Sakshi

నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు.

సాక్షి, హైదరాబాద్‌: నిలోఫర్‌ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. హాస్పిటల్ మొదటి అంతస్తులోని ల్యాబ్‌లో మంటలు చెలరేగడంతో దట్టంగా పొగ అలుముకుంది. దీంతో పిల్లలు, తల్లిదండ్రులు, అస్పత్రి సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ప్రమాదంపై అధికారులు స్పందించారు.

అయితే జరిగింది స్వల్ప అగ్ని ప్రమాదమేనని నీలోఫర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి మీడియాకు తెలిపారు. ‘‘ల్యాబ్ లో సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో స్వల్ప అగ్నిప్రమాదం. ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదు. మొదటి అంతస్తులో ల్యాబ్ లోని ఫ్రిడ్జ్ లో షార్ట్ సర్క్యూట్ వల్ల ఇదంతా..

.. ఫ్రిడ్జ్ దగ్గరలో రబ్బరు పదార్థాల వల్ల ఎక్కువ పొగ వచ్చింది. దీంతో పేషంట్స్ అటెండర్స్ కొంత భయాందోళనకు గురయ్యారు. వెంటనే మా సిబ్బంది ఫైర్ సిలిండర్ల సహాయంతో మంటలు ఆర్పివేశారు. ఈ ప్రమాదం లో ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. సిబ్బంది ఫైర్ సేఫ్టీ పై ట్రైన్ అయ్యి ఉండడం వల్ల వెంటనే మంటలు ఆర్పివేశారు అని ఉషారాణి వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement