తమిళనాట కల్తీ మద్యం కాటు.. తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్‌ ట్వీట్‌ BRS working president and former minister KTR reacted to Liquor Tragedy in Tamil Nadu Kallakurichi. Sakshi
Sakshi News home page

తమిళనాట కల్తీ మద్యం కాటు.. తెలంగాణ సర్కార్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

Published Fri, Jun 21 2024 9:02 AM | Last Updated on Fri, Jun 21 2024 10:16 AM

Ex Minister Ktr Respond Over Tamil Nadu Illicit Liquor Consumption

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడులోని కల్లకురిచిలో కల్తీ మద్యం తాగి దాదాపు 50 మంది మృతిచెందారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ స్పందించారు. ఈ క్రమంలో తెలంగాణలో అలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

కాగా, కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా..‘ప్రజల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది. తెలంగాణకు చౌకైన మద్యం బ్రాండ్‌లను తెస్తున్నారు. రాష్ట్రంలో తమిళనాడు కల్తీ సారా ఘటనలు రాకూడదు. ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్‌ చేశారు. 

 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement