ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలొస్తే మనదే గెలుపు: కేటీఆర్‌ | By-elections in Khairatabad? | Sakshi
Sakshi News home page

ఖైరతాబాద్‌కు ఉపఎన్నికలొస్తే మనదే గెలుపు: కేటీఆర్‌

Aug 10 2024 7:39 AM | Updated on Aug 10 2024 9:26 AM

 By-elections in Khairatabad?

బంజారాహిల్స్‌: ఖైరతాబాద్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని, బీఆర్‌ఎస్‌ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గ నేతలతో శుక్రవారం ఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. 

భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఈ నియోజకవర్గానికి తప్పనిసరిగా ఉప ఎన్నిక వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం కార్యకర్తలు సమాయత్తం కావాలని సూచించారు. కార్యక్రమంలో మన్నె గోవర్ధన్‌రెడ్డి, జెజొల్ల రాజు ముదిరాజ్, కొమ్ము విజయ్‌కుమార్, విజయ్‌కృష్ణ, అజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement