Banjara Hills: మిసెస్‌ ఇండియాగా డాక్టర్‌ మతీన్‌ | Dr Matin from Hyderabad As Mrs India | Sakshi
Sakshi News home page

Banjara Hills: మిసెస్‌ ఇండియాగా డాక్టర్‌ మతీన్‌

Jan 9 2022 8:15 AM | Updated on Jan 9 2022 11:02 AM

Dr Matin from Hyderabad As Mrs India - Sakshi

డాక్టర్‌ మతీన్‌ జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైద్యురాలైనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా..

బంజారాహిల్స్‌: నగరానికి చెందిన న్యూట్రిషనిస్ట్‌ డాక్టర్‌ మతీన్‌ అస్రార్‌కు అరుదైన గౌరవం దక్కింది. న్యూఢిల్లీలో జరిగిన అందాల పోటీల్లో డాక్టర్‌ మతీన్‌ రెండు విభాగాల్లో పతకాలను సాధించారు. ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్‌డీ పూర్తిచేసిన డాక్టర్‌ మతీన్‌ ప్రస్తుతం నగరంలోని పలు ప్రముఖ ఆస్పత్రుల్లో సేవలు అందిస్తున్నారు.

గతవారం ఢిల్లీలో జరిగిన మిసెస్‌ ఇండియా వన్‌ ఇన్‌ ఏ మిలియన్‌ క్లాసిక్‌ విభాగంలో పాల్గొన్న డాక్టర్‌ మతీన్‌ బ్యూటీ విత్‌ బ్రెయిన్, ఇంటర్నేషనల్‌ ఐకాన్‌ కేటగిరీలలో విజేత గా నిలిచారు. డాక్టర్‌ మతీన్‌ జూబ్లీహిల్స్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వైద్యురాలైనా ఈ పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందన్నారు. దేశ వ్యాప్తంగా ఈ పోటీల్లో 103 మంది పాల్గొన్నారని తాను రెండు కేటగిరీలలో విజేతగా నిలవడం సంతోషంగా ఉంది అని అన్నారు.  
(చదవండి: ఉత్సాహంగా బర్డ్‌ వాక్‌ ఫెస్టివల్‌)

Advertisement
 
Advertisement
Advertisement