హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌ | Sakshi
Sakshi News home page

హరీశ్‌రావుకు సీఎం రేవంత్‌ రెడ్డి కౌంటర్‌

Published Fri, Apr 26 2024 8:55 PM

Cm Revanth Reddy Counter To Harish Rao

సాక్షి, హైదరాబాద్‌: మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీశ్‌రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తది అంటూ సీఎం రేవంత్‌రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. శుక్రవారం ఆయన సోషల్‌ మీడియా సమావేశంలో మాట్లాడుతూ, హరీశ్‌ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా?. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటుండు.. రాజీనామా లేఖ అలా ఉండదు.. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారు’’ అని ఎద్దేవా చేశారు.

స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు. హరీశ్‌ తెలివి ప్రదర్శిస్తున్నారు.. ఆయన తెలివి మోకాళ్లలో కాదు.. అరికాళ్లలోకి జారినట్టుంది.. హరీశ్‌..ఇప్పటికీ చెబుతున్నా.. నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నాం.. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. నీ రాజీనామా రెడీగా పెట్టుకో’’ అంటూ రేవంత్‌ సవాల్‌ విసిరారు.

రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్‌ జోకర్‌ అయ్యాడు:మంత్రి కోమటిరెడ్డి
మరోసారి రాజీనామా లేఖ పేరుతో హరీశ్‌రావు డ్రామాలు చేస్తున్నారంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మండిపడ్డారు. హరీశ్‌ బీఆర్‌ఎస్‌లో ఉద్యోగి మాత్రమే. ఆగస్టు 15లోపు 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం. హరీశ్‌రావుకు పర్సనాలిటీ పెరిగింది కానీ.. బుర్ర మాత్రం పెరగలేదు. నీ దగ్గరకు పని కోసం వస్తే మంత్రిగా ఒక్క పని చేయకలేకపోయావు. రాజీనామా పేరుతో మళ్లీ హరీశ్‌రావు జోకర్‌ అయ్యాడు. బీఆర్‌ఎస్‌ పార్టీనే మోసాల పార్టీ, అవినీతి పార్టీ’’ అంటూ మంత్రి కోమటిరెడ్డి దుయ్యబట్టారు.

హరీశ్‌రావుది దొంగ రాజీనామా. మీరు దొంగ దీక్షలు చేసినట్లు ఇప్పుడు చేస్తే నడవదు.ఇవాళ మళ్లీ మోసం చేయానికి వచ్చిండు.. నువ్వు డ్రామాలు ఆడితే ప్రజలు పట్టించుకోరు.. నువ్వు కేసీఆర్ కింద గులాం గిరి చేయాలి తప్ప నిన్ను ఎవరు పట్టించుకోరు.. 20 ఎండ్ల కింద 76 వేల కోట్ల రుణ మాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. దమ్ముంటే మెదక్‌లో డిపాజిట్‌ తెచ్చుకో.. బీఆర్‌ఎస్‌ పార్టీ జూన్ 4 నుంచి దుకాణం బంద్‌ అవుతుంది. కేసీఆర్‌ దళితున్ని ముఖ్యమంత్రి చేశారా?. తెలంగాణా వస్తే దళిత ముఖ్యమంత్రి చేస్తా.. లేకుంటే నా మెడ మీద తలకాయ ఉండదు అన్నాడు.. నువ్వు తీసుకోలేదు తలకాయ మమ్మల్ని తీయమంటావా? లేకుంటే దళితులను తీయమంటావా?’’ అంటూ కోమటిరెడ్డి ధ్వజమెత్తారు.

 

 

Advertisement
Advertisement