Medak: రన్నింగ్‌ కారులో మంటలు.. దగ్ధమైన కారు | Car Catches Fire On Road At Medak highway burning | Sakshi
Sakshi News home page

Medak: రన్నింగ్‌ కారులో మంటలు.. దగ్ధమైన కారు

May 5 2024 1:31 PM | Updated on May 5 2024 1:56 PM

Car Catches Fire On Road At Medak highway burning

సాక్షి, మెదక్‌: మెదక్‌ జిల్లా జాతీయ రహదారిపై ఓ కారు అగ్నికి ఆహుతైంది. టేక్మాల్ మండలం బొడ్మట్ పల్లి వద్ద జాతీయ రహదారి 161పై వెళ్తున్న కారులో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. దీంతో నిమిషాల్లోనే కారు పూర్తిగా దగ్దమైంది. అయితే డ్రైవర్ అప్రమత్తతో  పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. హైదరాబాద్‌ నుంచి నారాయణ్ ఖేడ్ వెళ్తుండగా  ఈ ఘటన చోటుచేసుకుంది. 

Advertisement
 
Advertisement
Advertisement