నేడు హైదరాబాద్‌కు కేటీఆర్‌ | BRS Working President KTR foreign tour ends | Sakshi
Sakshi News home page

నేడు హైదరాబాద్‌కు కేటీఆర్‌

Jun 6 2025 4:08 AM | Updated on Jun 6 2025 4:08 AM

BRS Working President KTR foreign tour ends

గత నెల 27న విదేశీ పర్యటనకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ 

సాక్షి, హైదరాబాద్‌: గత నెల 27న విదేశీ పర్యటనకు వెళ్లిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. శుక్రవారం హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ‘ఫార్ములా–ఈ’రేస్‌కు సంబంధించి మే 28న విచారణకు రావాల్సిందిగా కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు ఇవ్వగా, తాను విదేశీ పర్యటన అనంతరం హాజరవుతానంటూ ఆయన లేఖ రాసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ నెల మూడో వారంలో కేటీఆర్‌ ఏసీబీ విచారణకు హాజరయ్యే అవకాశమున్నట్లు తెలిసింది. కాగా, జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ అస్వస్థతకు గురైన నేపథ్యంలో కేటీఆర్‌ తన అమెరికా పర్యటనను కుదించుకున్నారు. ఆయన భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం బయల్దేరతారు. గోపీనాథ్‌ కుటుంబసభ్యులతో పాటు హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రి వైద్యులతో కేటీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement