కొమురవెల్లిలో అఘోరీ హల్‌చల్‌ | Aghori Hulchul In Komuravelli Temple, Attack On People And Reporter Phone Destroyed, Video Went Viral | Sakshi
Sakshi News home page

కొమురవెల్లిలో అఘోరీ హల్‌చల్‌

Jan 29 2025 1:39 PM | Updated on Jan 29 2025 1:47 PM

Aghori Hulchul In Temple

జనంపై కత్తితో దాడి, ఒకరికి తీవ్రగాయాలు

ఓ విలేకరి సెల్‌ఫోన్‌ ధ్వంసం

కొమురవెల్లి(సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చిన అఘోరీ (నాగసాధువు) మంగళవారం హల్‌చల్‌ చేసింది. కత్తితో జనంపైకి దూసుకువచ్చి దాడికి పాల్పడింది. ఈ క్రమంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. భక్తులందరూ భయభ్రాంతులకు గురయ్యారు. ముందుగా ఆలయంలోకి వెళ్లి స్వామి వారిని దర్శించుకునేందకు ప్రయత్నించింది. దిగంబరంగా కాకుండా వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించుకుకోవాలని ఆల య అధికారులు సూచించారు. దీంతో కోపోద్రిక్తురాలైన అఘోరీ ఒక్క సారిగా కత్తిని చేత పట్టుకుని హంగామా సృష్టించింది. 

ఈక్రమంలో స్థానికునికి తీవ్రగాయాలయ్యాయి. అక్కడే ఉండి వీడియో చిత్రీకరిస్తున్న ఓ విలేకరి సెల్‌ఫోన్‌ లాక్కోని ధ్వసం చేసింది. అంతే కాకుండా ప్రజలను తీవ్ర పదజాలంతో దూషించింది. అనంతరం తన వద్ద ఉన్న నల్లని వస్త్రాలు ధరించి స్వామి వారిని దర్శించుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని అఘోరీని పంపించడంతో సమస్య సద్దు మణిగింది. అఘోరీలు దైవమార్గంలో ఉంటూ భక్తులకు మార్గదర్శకంగా ఉండాల్సింది పోయి భక్తులపై దాడి చేయడం ఏమిటని స్థానికంగా చర్చనీయంశమైంది. అఘోరీ కొంత కాలంగా తెలుగు రాష్ట్రాలలో ఉద్రిక్తతలు సృష్టిస్తున్న విషయం విధితమే.

 

 

Advertisement
 
Advertisement
Advertisement