Telugu States IMD Report: Heavy To Moderate Rains In Ap And Telangana - Sakshi
Sakshi News home page

AP & TS Rainfall Update: చల్లటి కబురు.. తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల పాటు వర్షాలు

Published Tue, Jun 27 2023 7:01 AM

Heavy To Moderate Rains In Ap And Telangana Says Imd - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భానుడి సెగలతో ఉక్కిరిబిక్కిరి అయిన తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రానున్న రెండ్రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ నేపథ్యంలో వేసవి తాపం, మండే ఎండలు, వడగాడ్పుల నుంచి తెలుగు ప్రజలకు కాస్త ఉపశమనం దొరకనుంది. రుతుపవనాలు ప్రస్తుతం చురుగ్గా కదులుతుండడంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి.

ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు  కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలో.. మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ వానలు కురిసే అవకాశం ఉండగా..  ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురువనున్నట్లు తెలిపింది. మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు.. శ్రీకాకుళం, మన్యం, అనకాపల్లి, అల్లూరి, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కడప, సత్యసాయి, నంద్యాల జిల్లాలోనూ ఓ మోస్తరు మంచి తేలికపాటి వర్షాలు పడునున్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది.

చదవండి: నాతో సెల్ఫీ కావాలా.?

Advertisement
Advertisement