క్లుప్తంగా | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Published Tue, Apr 23 2024 8:30 AM

-

వడదెబ్బకు యువకుడి మృతి

అన్నానగర్‌: వడదెబ్బకు ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు.. కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై సమీపంలోని ఆదాలియూర్‌ ప్రాంతానికి చెంది న మునుస్వామి (33) ప్రైవేటు పాల కంపెనీలో పని చేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం మునుస్వామి క్రికెట్‌ ఆడుతుండగా వేడిమికి స్పృహతప్పి కింద పడిపోయాడు. వెంటనే చికిత్స నిమి త్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

రైలు ఢీకొని మహిళ..

అన్నానగర్‌: రైలు ఢీకొని ఓ మహిళ మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. చైన్నెలోని పుదువన్నారాపేట్‌లోని అన్నై ఇందిరాగాంధీ నగర్‌కు చెంది న వడివుక్కరసి (40). ఆదివారం సాయంత్రం ఎన్నూర్‌లోని తన బంధువుల ఇంటికి వెళ్లడానికి తండయార్‌ పేట వీఓసీ రైల్వే స్టేషన్‌కు వెళ్లింది. అక్కడ పట్టాలు దాటుతుండగా ఎక్స్‌ప్రెస్‌ రైలు ఢీకొని తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను అంబులెన్స్‌లో స్టాన్లీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వడివుక్కరసి మృతి చెందింది. రైల్వే ఇన్‌స్పెక్టర్‌ శశికళ, కొరుక్కుపేట పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.

ప్రత్యర్థి దాడిలో వృద్ధుడు..

అన్నానగర్‌: ప్రత్యర్థుల దాడిలో వృద్ధుడు మృతి చెందాడు. తిరువారూర్‌ జిల్లాలోని పెరళం సమీపంలోని ఎన్నక్కుడి గ్రామంలో చిత్రపట్టన్‌ వీరన్‌ దేవాలయం లో చిత్ర పౌర్ణమి ఉత్సవాల ను నిర్వహించే విషయంపై ఆదివారం ఆలయ పరిసరాల్లో సమావేశం జరిగింది. సమావేశానికి హాజరైన అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌ (58), విజయరాఘవన్‌ (31) మధ్య వి వాదం చోటుచేసుకుంది. అప్పుడు విజయరాఘవన్‌ తీవ్ర ఆవేశానికి గురై చంద్రశేఖర్‌ను కా లితో తన్నినట్లు తెలుస్తోంది. దీంతో చంద్రశేఖ ర్‌ మృతి చెందారు. పోలీసులు హత్య కేసు న మోదు చేసి విజయరాఘవన్‌ను అరెస్టు చేశారు.

27 గొర్రె పిల్లలు దహనం

అన్నానగర్‌: ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో 27 గొర్రెపిల్లలు సజీవ దహన మయ్యాయి. నాగై జిల్లా తిరుమరుగల్‌ అగ్రహా రం ప్రాంతానికి చెందిన షణ్ముగం ము రుగరాజ్‌ (38) దాదాపు 150 గొర్రెలను పెంచుతున్నాడు. ఆదివారం కూడా ఎప్పటిలాగే నాగై సమీపంలో పోలకం – మనంపేట నదీతీర ర హదారి పక్కన వాటిని మేపడానికి తీసుకెళ్లాడు. వాటి పిల్లలను పొలం మధ్యలో గడ్డి బుట్టలలో ఉంచాడు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మైదానం బయట ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అవి గొర్రెలను ఉంచిన బుట్టలకు మంటలు వ్యాపించాయి. దీంతో 27 గొర్రె పి ల్లలు మంటల్లో చిక్కుకుని మృతి చెందాయి. స్థానిక పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement