ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్‌ కార్తిక్‌ | - | Sakshi
Sakshi News home page

ఎందరో సహకారంతో ఈ స్థాయికి చేరా: దినేష్‌ కార్తిక్‌

Jul 2 2023 7:34 AM | Updated on Jul 2 2023 7:40 AM

- - Sakshi

తన క్రికెట్‌ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్‌, స్టైలిష్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తిక్‌ తెలిపారు.

సాక్షి, చైన్నె: తన క్రికెట్‌ పయనంలో ఎందరో సహకారంతోనే తాను ఈ స్థాయికి చేరినట్టు క్రికెటర్‌, స్టైలిష్‌ వికెట్‌ కీపర్‌ దినేష్‌ కార్తిక్‌ తెలిపారు. పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ అంబాసిడర్‌గా ఆయన నియమితులయ్యారు. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో దినేష్‌ కార్తిక్‌ స్ఫూర్తితో కొత్త స్పోర్ట్స్‌ వేర్‌ లైన్‌ను పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ ప్రారంభించింది. ఈ సందర్భంగా తన క్రికెట్‌ పయనం, పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌, ఐపీఎల్‌ అనుభవాలను గురించి దినేష్‌ కార్తిక్‌ మీడియాకు వివరించారు.

పరిమ్యాచ్‌ స్పోర్ట్స్‌ అనేది అసమానమైన శైలి, అసాధారణమైన సౌలభ్యం, బలమైన విజేత స్ఫూర్తిని సూచించే బ్రాండ్‌గా వ్యాఖ్యలు చేశారు. తనకు చిన్న తనం నుంచి ఎన్నో ఆశలు ఉండేవని, ఇవి ప్రస్తుతం సాకారం అవుతున్నట్టు వివరించారు.

ఎందరో సహకారంతో తాను ఈ స్థాయికి చేరానని తెలిపారు. తన బ్యాట్‌, జెర్సీ, క్యాప్‌, ఇలా అన్నింటా ప్రత్యేకతను చాటుకోవాలన్న తపనతో ముందుకెళుతున్నట్టు చెప్పారు. నిబంధనలకు అనుగుణంగానే తాను ఈ వ్యవహారంలో నడుచుకుంటానని వ్యాఖ్యానించారు.

Advertisement
 
Advertisement
Advertisement