‘నాన్‌స్టాప్’గా రద్దీ
శ్రీకాకుళం అర్బన్: జిల్లాకేంద్రమైన శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ బుధవారం ప్రయాణికులతో కిటకిటలాడింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓట్లు వేసేందుకు దూరప్రాంతాల నుంచి వచ్చిన ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం స్వస్థలాలకు బయలుదేరేందుకు ఆర్టీసీ కాంప్లెక్స్‌కు చేరుకోవడంతో రద్దీగా కనిపించింది. నాన్‌స్టాప్ కౌంటర్ వద్ద బారులు తీరుతూ కనిపించారు. రద్దీకి తగ్గట్లు బస్సులు సిద్ధం చేశారు.
నాలుగోసారి గౌరవ డాక్టరేట్
శ్రీకాకుళం: సామాజిక సేవకుడు డాక్టర్ మంత్రి వెంకటస్వామికి నాలుగో సారి గౌరవ డాక్టరేట్ లభించింది. బుధవారం న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో డే స్ప్రింగ్ ఇంటర్‌నేషనల్ యూనివర్సీటీ, భారత్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ సంయుక్తంగా నిర్వహించిన సభలో వెంకటస్వామికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment