మంచి మందులిచ్చారు | Sakshi
Sakshi News home page

మంచి మందులిచ్చారు

Published Mon, Apr 8 2024 12:50 AM

హిరమండలంలో ఇంటికి వచ్చి వైద్యం అందిస్తున్న డాక్టర్లు - Sakshi

మా గ్రామంలో సంక్రాంతి ముందు పంచాయతీ ఆఫీసు వద్దకు డాక్టర్లంతా వచ్చి పెద్ద కార్యక్రమం చేశారు. నేను మా వలంటీరు రాజు చెప్పినట్టు అక్కడున్న డాక్టరు బాబుని కలిశాను. నాకున్న నడుపు నొప్పి, కాలు నొప్పి కోసం చెప్పాను. ఏమీ ఫరవాలేదమ్మా అని చెప్పి మంచి మందులిచ్చారు. కంటి డాక్టరు బాబు కూడా అక్కడే ఉంటే అక్కడికి వెళ్తే అన్ని రకాలుగా తనిఖీలు చేశారు. కళ్లద్దాలను మా ఊరులో పనిచేసే అమ్మ తెచ్చి కొద్ది రోజుల తర్వాత తెచ్చి ఇచ్చింది. మందులను మాత్రం రోజూ తప్పకుండా వేయా లని డాక్టరు చెప్పారు. అలాగే వేశాను. నడుము నొప్పి బాగా తగ్గింది. ఇంటికే పెద్ద డాక్టరు బాబు వస్తున్నారు. అన్నీ అడిగి మందులిస్తున్నారు. అన్ని గ్రామాలకు ఇలానే వెళ్తున్నారు అని తెలిసింది. సీఎం జగన్‌బాబు చల్లగుండాలి.

– కింతలి రాజేశ్వరమ్మ, తోనంగి, గార మండలం

1/1

Advertisement
Advertisement