ఎన్నికల చట్టాలను గౌరవించే పార్టీ వైఎస్సార్‌ సీపీ | Sakshi
Sakshi News home page

ఎన్నికల చట్టాలను గౌరవించే పార్టీ వైఎస్సార్‌ సీపీ

Published Sun, Apr 7 2024 12:45 AM

సమావేశంలో మాట్లాడుతున్న 
కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌    - Sakshi

పోలాకి: ఎన్నికల చట్టాలను గౌరవించి, నియమావళిని శతశాతం పాటించే క్రమశిక్షణ కలిగిన పార్టీ వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని ఆ పార్టీ లీగల్‌సెల్‌ జిల్లా చైర్మన్‌ జి.వి.వి.గణేష్‌నాయుడు అన్నారు. శనివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ను కలిసి ఎన్నికల చట్టాలు, నియమావళికి సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. రాజకీయాల్లో సీఎం జగన్‌ క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గుర్తింపుపొందారని, చట్టాలను గౌరవించి రాజ్యాంగబద్ధంగా పరిపాలన నిర్వహించిన పార్టీకి ప్రతినిధులుగా బాధ్యతగా మెలగాలని పార్టీశ్రేణులకు సూచించారు. విపక్షాల ఎత్తుగడలు, కుట్రలకు ఆవేశపడకుండా న్యాయబద్ధంగా పోరాటం చేయాలని, అంతిమ విజయం న్యాయానిదేనని చెప్పారు.

24 గంటల్లోపు బోర్లు బాగుచేయాలి

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: గ్రామాల్లో పాడైన చేతిపంపు(బోర్లు)లను గుర్తించి 24 గంటల్లోగా మరమ్మతులు పూర్తి చేయాలని కలెక్టర్‌ మనజీర్‌ జిలానీ సమూన్‌ గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులను ఆదేశించారు. కలెక్టర్‌ సమావేశ మందిరంలో అన్ని మండలాల ఎంపీడీఓలు, మున్సిపల్‌ కమిషనర్లు, ఇంజినీరింగ్‌ అధికారులతో తాగునీటి ఎద్దడి, ఉపాధి హామీ పనులు, విద్యుత్‌ సరఫరా తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి కొరత ఉన్న చోట్ల ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని ఆదేశించారు. ఉపాధి వేతనదారుల రోజుకూలి రూ.300కు పెరిగిందని చెప్పారు. సోమవారం నుంచి జిల్లాలో 1.82 లక్షల మంది ఉపాధి పనులకు హాజరవుతారని తెలిపారు. ఉపాధి పనులు జరిగే ప్రదేశాల వద్ద టెంట్లు, తాగునీటి సౌకర్యం కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జెడ్పీ సీఈవో వెంకటేశ్వరరావు, ఏపీ ఈపీడీసీఎల్‌ ఎస్‌ఈ నాగిరెడ్డి కృష్ణమూర్తి, డీపీఓ వెంకటేశ్వర్లు, డ్వామా పీడీ ఎన్‌.వి.చిట్టి రాజు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఇన్‌చార్జి ఎస్‌ఈ జి.జె.బెనహర్‌ తదితరులు పాల్గొన్నారు.

వైభవంగా బుడ్డుయాత్ర

ఇచ్ఛాపురం: పట్టణ పరిధిలోని బాహుదా నదిలో బుడ్డు యాత్ర శనివారం ఘనంగా నిర్వహించారు. బాహుదానది పరివాహక ప్రాంతంలో వెలసిన పాతాళ సిద్ధేశ్వరాలయం వద్ద పరమశివుడికి ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు చేశారు. 12 ఏళ్లకు ఓసారి నిర్వహించే ఈ యాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నసమారాధన ఏర్పాటు చేశారు.

లజపతిరాయ్‌ కుటుంబానికి పరామర్శ

టెక్కలి: అంబేడ్కర్‌ యూనివర్శిటీ మాజీ వీసీ హనుమంతు లజపతిరాయ్‌ కుటుంబాన్ని నరసన్నపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌, కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరిబాబు తదితరులు శనివారం పరామర్శించారు. లజపతిరాయ్‌ తల్లి సుశీలమ్మ ఇటీవల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టెక్కలి మండలం తలగాం గ్రామంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమానికి నాయకులు హాజరై సంతాపాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైస్‌ ఎంపీపీ పి.రమేష్‌, నాయకులు హెచ్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

భక్తులకు అన్నప్రసాద వితరణ
1/2

భక్తులకు అన్నప్రసాద వితరణ

కృష్ణదాస్‌కు ఎన్నికల చట్టాలు, నియమావళి పుస్తకాన్ని అందిస్తున్న గణేష్‌నాయుడు
2/2

కృష్ణదాస్‌కు ఎన్నికల చట్టాలు, నియమావళి పుస్తకాన్ని అందిస్తున్న గణేష్‌నాయుడు

Advertisement
Advertisement