నేడు రాజశ్యామల హోమం నిర్వహణ

నగదుతో పట్టుబడిన కారు  - Sakshi

శ్రీకాకుళం కల్చరల్‌: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టనున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర విజయవంతం కావాలని కోరుతూ మంగళవారం రాజశ్యామల మూలమంత్ర సహిత దుర్గా సంపుటిత హోమం నిర్వహించనున్నట్లు కళింగ వైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సురిబాబు ఓ ప్రకటనలో తెలిపారు. నగరంలోని రామలక్ష్మణ కూడలి వద్ద ఉన్న దుర్గా మహాలక్ష్మీ దేవాలయంలో మంళగవారం ఉదయం 8గంటల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ బస్సు యాత్రలో గత ఐదేళ్ల సంక్షేమంతో పాటు రానున్న ఐదేళ్లలో చేపట్టబోయే కార్యక్రమాల గురించి వివరిస్తారని పేర్కొన్నారు. ఈ యాగంలొ వైఎస్సార్‌ సీపీ ఇన్‌చార్జిలు, మహిళలు, అందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

రూ. 2 లక్షలు నగదు పట్టివేత

సరుబుజ్జిలి: ఎలాంటి ఆధారాలు లేకుండా తీసుకెళ్తున్న రూ.2లక్షల నగదును ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృంద సభ్యులు సోమవారం అమృత లింగానగరం వద్ద పట్టుకున్నారు. హిరమండలం నుంచి శ్రీకాకుళం వెళ్తున్న సమయంలో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందం తనిఖీ చేయగా ఓ కారులో ఈ నగదు దొరికినట్లు వారు తెలిపారు. నగదును స్థానిక పోలీస్‌స్టేషన్‌కు అప్పగించారు. ఈ తనిఖీల్లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఆర్‌ఎస్‌డీటీ ఎస్‌.వెంకటరావు, సిబ్బంది సత్యనారాయణ, లక్ష్మణరావు పాల్గొన్నారు.

గంజాయి తరలిస్తున్న ఐదుగురు అరెస్టు

పాతపట్నం: గంజాయి రవాణా చేస్తున్న ఒడిశా కు చెందిన ఐదుగురు వ్యక్తులను పాతపట్నం పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసు కుని వారి నుంచి రూ.1.20 లక్షలు విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్‌ఐ మహమ్మద్‌ యాసీన్‌ తెలిపిన వివరాల ప్రకా రం.. ఆదివారం రాత్రి ఒడిశా నుంచి పాతప ట్నం ఆటోలో ఐదుగురు వ్యక్తులు వస్తుండగా పాతపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్‌ అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద పోలీసులు తనిఖీ చేశారు. దీంతో వారి వద్ద ఉన్న బ్యాగ్‌లో గంజాయి కనిపించింది. ఒడిశా రాష్ట్రం, గజపతి జిల్లా, గుసాని బ్లాక్‌, అడవ గ్రామానికి చెందిన సరోజ్‌ పాయక్‌, రాజా నాయక్‌, సంపత్‌ దండసేనా, లింగరాజు నాయక్‌, మున్నా నాయక్‌ కలిసి తమ బ్యాగ్‌లో 26 కిలోల గంజాయి తీసుకుని ఆటోలో పాతపట్నం వచ్చి, అక్కడ నుంచి ఆముదాలవలస రైల్వేస్టేషన్‌కు అక్కడ నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్తున్నట్లు విచారణలో తెలుసుకున్నా రు. నిందితులను అరెస్ట్‌ చేసి సోమవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

బాధితులకు సెల్‌ఫోన్ల అందజేత

కాశీబుగ్గ: పలాస జీఆర్పీ స్టేషన్‌కు వచ్చిన సెల్‌ఫోన్‌ మిస్సింగ్‌ కేసుల బాధితుల్లో కొందరికి సోమవారం వారి సెల్‌ఫోన్లను అందించా రు. రైళ్లలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న వారు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు పలాస జీఆర్పీ ఎస్‌ ఐ ప్రత్యేక క్రైమ్‌ బృందాన్ని ఏర్పాటు చేసి సీఈఐఆర్‌ వెబ్‌సైట్‌ సాయంతో పోగొట్టుకున్న మూ డు మొబైల్‌ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందించారు. వీటి విలువ సుమారు రూ.1,00,999 ఉంటుందన్నారు. పలాస జీఆ ర్పీ ఎస్‌ఐ షరీఫ్‌ ఆధ్వర్యంలో హెచ్‌సీ పి.కోదండరావు, పీసీ ఎం.సంతోష్‌కుమార్‌, బి.దేవేంద్రనాథ్‌, రమేష్‌బాబు కేసును డిటెక్ట్‌ చేశారు. వీటిలో రూ.60,999 విలువ కలిగిన ఎల్‌జి మొ బైల్‌ ఫోనును సచివాలయ ఉద్యోగి యువరాజుకి, రూ.20 వేలు విలువ కలిగిన శ్రీకాకుళం రోడ్డు ఆర్‌ఎస్‌కు చెందిన తాలూకా లక్ష్మణరావుకి, రూ.20 వేలు విలువ కలిగిన రియల్‌ మీ 8.5జిబి మొబైల్‌ ఫోను పూండి ఆర్‌ఎస్‌ నందు రైల్వే ఎంప్లాయీ తిరుపతిరావుకి అందించారు.

అంధవరపు

సూరిబాబ

Election 2024

Read latest Srikakulam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top