వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీలోకి భారీగా చేరికలు

Published Mon, Apr 8 2024 12:50 AM

మంత్రి సమక్షంలో వైఎస్సార్‌ సీపీలో చేరిన గురుదాసుపురం తెలుగుదేశం కార్యకర్తలు  - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): బీద వర్గాలకు అనుకూలంగా ఉండేలా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పాలన అందిస్తోందని రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శ్రీకాకుళం నగరంలో టౌన్‌హాల్‌లో యాదవులతో ఆదివారం ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు పార్టీలకు చెందిన యా దవులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. ధర్మాన మా ట్లాడుతూ.. మన జిల్లాలో మూలపేట పోర్టు, బుడగట్లపాలెం ఫిషింగ్‌ హార్బర్‌ పనులు మొదలుపెట్టామని తెలిపారు. తిరుపతి దేవస్థానంలో అనాది గా వస్తున్న సన్నిధి గొల్లలు స్వామిని మొదట దర్శనం చేసుకునే విధంగా సంబంధిత నియమాన్ని పునరుద్ధరించామని గుర్తు చేశారు. యాదవులకు రాజ్యసభ టికెట్లు– 5 ఎమ్మెల్సీ టిక్కెట్లు ఇచ్చామని ఇప్పుడు 2 ఎంపీ టికెట్లు, 4 ఎమ్మెల్యే టిక్కెట్లు కేటాయించామన్నారు. మొదటిసారి అరసవల్లి ట్రస్ట్‌లో యాదవులకు సముచిత స్థానం కల్పించామన్నారు. చంద్రబాబుకు యాదవుల ఓట్లు కావాలే తప్ప పదవులు, సంక్షేమం అందించలేదన్నారు. ఏనాడైనా టీడీపీలో ఇన్ని పదవులు ఇచ్చారా అని ప్రశ్నించారు. పెదపాడులో తాగునీటి సమస్యలు తీరుస్తున్నామన్నారు. ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా పేరాడ తిలక్‌ ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, తూర్పుకాపు కార్పొరేషన్‌ చైర్మన్‌ మామిడి శ్రీకాంత్‌, ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్‌, యువనేత ధర్మాన రామ్‌మనోహర్‌నాయుడు, రాపా క చిన్నారావు, పాలిన శ్రీనివాసరావు, గద్దిబోయిన కృష్ణయాదవ్‌, బాగు దశరథ, పిట్ట దామోదరరావు, బూర పాపారావు, గురునాధయాదవ్‌, నర్తు నరేంద్రయాదవ్‌, లాయర్‌ బాలకృష్ణతో పాటు అధిక సంఖ్యలో యాదవులు పాల్గొన్నారు.

వైఎస్సార్‌సీపీలో టీడీపీ నాయకుల చేరిక

పలాస: పలాస మండలం గురుదాసుపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీకి చెందిన 25 మంది నేతలు ఆదివారం వైఎస్సార్‌ సీపీలో చేరారు. ఇరవై ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ గ్రామ అధ్యక్షునిగా పనిచేసిన

పోతనపల్లి మాధవరావు, సొర్ర పెద్ద రామారావు, మాజీ సర్పంచ్‌ చిట్టయ్య తదితరులు మంత్రి డాక్టరు సీదిరి అప్పలరాజు సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. డాక్టరు సీదిరి అప్పలరాజును గెలిపించడానికి తామంతా కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పంచాయతీ సర్పంచి అభ్యర్థి సొర్ర కామేశ్వరరావు, సొర్ర రామారావు, బొడ్డు దాసు, షణ్ముఖాచారి, ఏఎంసీ వైస్‌ చైర్‌పర్సన్‌ జినగ లోకేశ్వరి తదితరులు పాల్గొన్నారు.

రణస్థలం: మండలంలోని పైడిభీమవరం పంచాయతీలో గల సరగడపేట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు తూతి రాము, దుంగ తవుడుతో పాటు పది కుటుంబాలు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌ కుమార్‌ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పార్టీ నాయకులు లంకలపల్లి ప్రసాద్‌, పైడిభీమవరం ఎంపీటీసీలు ఆకల శ్రీనివాసరావు, మునకాల దుర్గారావులు ఉన్నారు.

టీడీపీ కార్యకర్తలకు కండువా వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌
1/2

టీడీపీ కార్యకర్తలకు కండువా వేసి ఆహ్వానిస్తున్న ఎమ్మెల్యే కిరణ్‌

 పార్టీలో చేరిన వారితో మంత్రి ధర్మాన ప్రసాదరావు
2/2

పార్టీలో చేరిన వారితో మంత్రి ధర్మాన ప్రసాదరావు

Advertisement
Advertisement