‘కాళీపట్నం’ చూడర బాబూ | Sakshi
Sakshi News home page

‘కాళీపట్నం’ చూడర బాబూ

Published Fri, Nov 10 2023 4:52 AM

 సభలో మాట్లాడుతున్న అట్టాడ అప్పలనాయుడు 
 - Sakshi

శ్రీకాకుళం కల్చరల్‌: కాళీపట్నం రామారావు మాస్టారి రచనల కృషి, వ్యక్తిత్వాన్ని తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని శ్రీకాకుళ సాహితీ కార్యదర్శి అట్టాడ అప్పలనాయుడు అన్నారు. స్థానిక కథానిలయంలో కారా మాస్టారు శతజయంతి ప్రారంభ సభ గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో సభ నిర్వహించాలని సూచించారు. గంటేడ గౌరునాయుడు మాట్లాడుతూ సమాజ రుణం తీర్చుకునేందుకు సాహిత్యం ఒక పరికరంగా మా స్టారు భావించి నిరూపించారని అన్నారు. కథానిలయం ప్రతినిధి కేవీఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ ఒక నది ప్రయాణం చేసిన మేర సస్యశ్యామలం చేసినట్లు వ్యక్తులు తమ జీవన ప్రయాణంలో ఉపయుక్తులుగా ఉండాలని మాస్టారు ఎప్పుడూ అంటారని అన్నారు. శతజయంతి సంచిక తేవాలని, ముగింపు సభ పెద్ద ఎత్తున జరగాలని ప్రముఖ నాటక రచయిత దీర్ఘాసి విజయభాస్కర్‌ సందేశాన్ని పంపారు. అరసం అధ్యక్షుడు, సీనియర్‌ జర్నలిస్టు నల్లి ధర్మారావు మాట్లాడుతూ ఆయన నడత, కథా నడక గొప్ప అమూల్యమైన సంపద అని అన్నారు. కార్యక్రమంలో పి.భోగారావు, ఎస్‌.స్వామినాయుడు, పిఎస్‌ నాగరాజు, దాసరి రామచంద్రరావు, సీహెచ్‌ తిరుమలరావు, కె.దాసుబాబు, శ్రీనివాస్‌, రచయిత్రి భారవి, రామినాయడు, జి.రంగనాథం, బి.రంగారావు, సీహెచ్‌ రామచంద్రరావు, పండా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement