ఖాద్రీశా... గోవిందా
● భక్తులతో కిటకిటలాడిన లక్ష్మీనరసింహస్వామి ఆలయం
కదిరి టౌన్: భక్తులు కోరిన కోర్కెలు తీర్చే వసంతవల్లభుడు కొలువైన ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం శనివారం భక్తులతో పోటెత్తింది. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలిరావడంతో కిటకిటలాడింది. స్వామి దర్శనానికి క్యూలో బారులు తీరిన భక్తులు ‘ఖాద్రీశా... గోవిందా’ అంటూ స్వామివారిని కీర్తించగా నారసింహ నామంతో కదిరి ప్రతిధ్వనించింది. అనంతరం దేవేరులతో కలిసి కొలువుదీరిన స్వామివారిని దర్శించుకున్న భక్తులు తన్మయత్వం చెందారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.


