‘కూటమి’ నేత మట్టి దందా
ధర్మవరం: అందరూ ఎన్నికల హడావుడిలో ఉంటే.. ధర్మవరం మండలానికి చెందిన ఓ కూటమి నాయకుడు మట్టి దందాలో మునిగిపోయాడు. మండలంలోని ముచ్చురామి గ్రామం వద్ద జాతీయ రహదారికి సమీపంలో వెంచర్ వేసిన సదరు నాయకుడు.. ఇటీవలే భూమిని చదును చేశాడు. అయితే ఎగుడుదిగుడుగా ఉండటంతో సమీపంలో ఉన్న వంకలోని మట్టి తరలిస్తున్నాడు. రాత్రీపగలు తేడాలేకుండా జేసీబీ యంత్రాలు ఉపయోగించి టిప్పర్ల ద్వారా మట్టిని తీసుకెళ్తున్నాడు. సమీప పొలాల రైతులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నా... సదరు నేత అవేమీ పట్టించుకోవడం లేదు. వంకలోని మట్టిని తరలించడం వల్ల సమీపంలోని వ్యవసాయ బోరు బావుల్లో నీటి మట్టం తగ్గే అవకాశాలు ఉన్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇంత జరుగుతున్నా... రెవెన్యూ అధికారులు, పోలీసులు కన్నెత్తి చూడటం లేదు. ఇప్పటికైనా స్పందించి వంకలోని మట్టిని తరలించకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
వంకలోని మట్టిని
యంత్రాలతో తరలింపు
చోద్యం చూస్తున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment