● ఇద్దరికి గాయాలు
వెంకటాచలం: విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కారు బోల్తా పడిన ఘటన వెంకటాచలం మండలం తాటిపర్తిపాళెం రైల్వేగేటు వద్ద బుధవారం జరిగింది. సర్వేపల్లి వైపు నుంచి తాటిపర్తిపాళెం వైపు వెళుతున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని రైల్వేగేటు బ్రిడ్జి వద్ద బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారును నడుపుతున్న వ్యక్తితోపాటు మరో మహిళకు గాయాలయ్యాయి. గాయపడిన ఇరువురూ చికిత్సనిమిత్తం మరో వాహనంలో నెల్లూరుకు వెళ్లినట్లు తెలిసింది. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు.
Comments
Please login to add a commentAdd a comment