రైల్లోంచి పడి వ్యక్తి మృతి
మనుబోలు: రైల్లోంచి పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మనుబోలు మండలం కొమ్మలపూడి, మనుబోలు రైల్వేస్టేషన్ల మధ్య మంగళవారం జరిగింది. రైల్వే పోలీసుల వివరాల మేరకు కొమ్మలపూడి రైల్వేస్టేషన్ సమీపంలోని 148/1–3 కిలోమీటర్ వద్ద అప్ లైన్ ట్రాక్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని రైల్వే సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. అతను బ్లూ కలర్ కాటన్ జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నాడు. 25 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు ఉండవచ్చని భావిస్తున్నారు. రైల్వే ఎస్సై హరిచందన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment