నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు

Published Thu, May 16 2024 1:20 PM | Last Updated on Thu, May 16 2024 1:20 PM

-

గూడూరురూరల్‌: ఎన్నికల కోడ్‌ జూన్‌ 4వ తేదీ వరకు అమల్లో ఉన్నందున గూడూరు సబ్‌ డివిజన్‌లో సభలు, సమావేశాలు, ధర్నాలు, ర్యాలీలను నిషేధించినట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని టవర్‌క్లాక్‌ సెంటర్‌ వద్ద బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. ఎన్నికలు ముగిసినా ఫలితాలు వెలువడే వరకు 144 సెక్షన్‌తోపాటు పోలీస్‌ యాక్ట్‌ 30 అమల్లో ఉంటుందని, ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సభలు, సమావేశాల నిర్వహణకు ముందస్తుగా పోలీసు అనుమతి తప్పనిసరి అన్నారు. అలాగే ఈ నెల 13న ఎన్నికల సందర్భంగా చిల్లకూరులో జరిగిన ఘటనకు సంబంధించి విచారణ మొదలెట్టామని, అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement