పశుపోషకులకు వరం
పాడి రైతుల శ్రేయస్సే ధ్యేయంగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోంది. పశుపోషకులకు ప్రయోజనం చేకూర్చేలా పాలకు గిట్టుబాటు ధర కల్పించే దిశగా అమూల్ అనే సంస్థతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. అమూల్ సంస్థతో కలిసి జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా పాలను సేకరించనుంది. అందులో భాగంగా ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అమూల్ పాల సేకరణను ప్రారంభించిన ప్రభుత్వం జిల్లాలో కూడా ప్రారంభించనుండడంతో పశుపోషకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కోవూరు: జగనన్న పాలవెల్లువ కార్యక్రమం ద్వారా జిల్లాలో అమూల్ పాలసేకరణ కార్యక్రమాన్ని మరో కొద్ది రోజుల్లో ప్రారంభించేందుకు సన్నాహక కార్యక్రమాలు జరుగుతున్నాయి. జిల్లాలో దాదాపుగా 11 లక్షల ఆవులు, గేదెలు ఉన్నాయి. అలాగే 1.12 లక్షల మంది పాడి రైతులు ఉన్నట్లు అధికారుల అంచనా. జిల్లాలో దాదాపు 20 వరకు ప్రధాన డెయిరీలతోపాటు చిన్నా చితకా డెయిరీలు ఉన్నాయి. 500లకు పైగా పాల సేకరణ కేంద్రాలు ఉన్నాయి. వీటికి సంబంధించి నిత్యం 1.72 లక్షల లీటర్ల వరకు పాల సేకరణ చేస్తుంటారు. కాగా ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంతో అమూల్ సంస్థ కూడా జిల్లాలో అడుగుపెట్టనుంది.
స్థల సేకరణ
జగనన్న పాల వెల్లువ అంటే జిల్లాలోని పలు పాల కేంద్రాల్లో పాడి రైతులు పాలను విక్రయిస్తుంటారు. కాగా చాలాచోట్ల పాడి రైతులకు సరిపడా గిట్టుబాటు ధర రాలేదని తెలుస్తోంది. జగనన్న పాలవెల్లువ పథకం ద్వారా అమూల్‌తో కలిసి ప్రత్యేక యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్ల ద్వారా పాలకు కనీస మద్దతు ఇస్తూ పాడి రైతుల నుంచి నేరుగా పాల సేకరణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో పాల సేకరణకు సంబంధించి బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్‌లను 323 చోట్ల ఏర్పాటు చేసేందుకు స్థల సేకరణ పూర్తి చేశారు. దాదాపు రూ.10 లక్షల వ్యయంతో ఒక్కొక్క బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్‌ను నిర్మించనున్నారు. ఇప్పటికే గుడ్లూరు మండలం దరకానిపాడులో, లింగసముద్రం మండలం చిన్నపవనిలో, వింజమూరులో మూడు కేంద్రాలు, వింజమూరు మండలం ఊటుకూరు, గుండెమడకల ప్రాంతాల్లో బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తి చేశారు. మిగిలిన భవనాలు వివిధ నిర్మాణ దశల్లో ఉన్నాయి. త్వరలో వీటిని పూర్తి చేసి పాల సేకరణ చేసేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.
జిల్లాలో..
బల్క్ మిల్క్ కలెక్షన్
యూనిట్లు – 323
తొలి విడతలో నిర్మిస్తున్న
భవనాలు – 82
పూర్తయిన భవనాలు – 7
75 శాతం పూర్తయిన
భవనాలు – 26
50 శాతం పనులు
పూర్తయినవి – 22
బల్క్ మిల్క్ కలెక్షన్ యూనిట్లతో
పాడి పరిశ్రమ అభివృద్ధి
జిల్లాలో 323 యూనిట్ల ఏర్పాటుకు
స్థల సేకరణ పూర్తి
ఒక్కో యూనిట్‌కు రూ.10 లక్షలకు
పైగా ఖర్చు
శరవేగంగా నిర్మాణాలు
Comments
Please login to add a commentAdd a comment