Sakshi News home page

ఎంసీసీ ఉల్లంఘనపై కేసు నమోదు

Published Tue, Mar 26 2024 12:45 AM

- - Sakshi

నెల్లూరు(క్రైమ్‌): ఎంసీసీ ఉల్లంఘనపై చిన్నబజారు పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. వివరాలు.. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. రాజకీయ పార్టీల ప్రచార సభలు, సమావేశాలు, ర్యాలీలు, ప్రచార వాహనాలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. సోమవారం ఎలాంటి అనుమతులు లేకుండా నగరంలోని విరాట్‌నగర్‌లో కొణిదల విజయం.. కొట్టే లక్ష్యం అని, పవన్‌కళ్యాణ్‌ ఫొటో, స్టిక్కర్లు అతికించి ఉన్న ఇన్నోవా (ప్రచార) వాహనాన్ని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారులు గుర్తించారు. సదరు వాహన డ్రైవర్‌ ఎలాంటి అనుమతి ప్రతాలు లేవని చెప్పడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకుని చిన్నబజారు పోలీసులకు అప్పగించారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ అధికారి దామోదరరావు ఫిర్యాదు మేరకు ఎంసీసీ ఉల్లంఘనపై స్థానిక ఎస్సై లతీఫున్నీసా కేసు నమోదు చేశారు.

కామర్స్‌, బోటనీ, జువాలజీ

మూల్యాంకనం 27కి మార్పు

నెల్లూరు(టౌన్‌): ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి కామర్స్‌, బోటనీ, జువాలజీ జవాబు పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 27వ తేదీకి మార్పు చేసినట్లు ఆర్‌ఐఓ శ్రీనివాసులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూ ల్యాంకనానికి హాజరయ్యే అధ్యాపకులకు ఆయా కళాశాలల ప్రిన్సిపల్స్‌ ఈ విషయం తెలియజేసి వారిని మూల్యాంకనం క్యాంపులో రిపోర్ట్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఉత్సవమూర్తులకు

అభిషేకం

నెల్లూరు సిటీ: నెల్లూరు రూరల్‌ మండలంలోని నరసింహకొండ పై వెలసిన శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో సోమవా రం పౌర్ణమి తిధి సందర్భంగా ఉ త్సవమూర్తులకు ప్రత్యేక అభిషేకా లు, సాయంత్రం గరుడసేవ గిరి ప్రదక్షిణ కార్యక్రమాలు, విశేష పూజలు ప్రధానార్చకుడు భాస్కరాచార్యులు ఆధ్వర్యంలో వైభవంగా జరిగాయి. నెల్లూరు వాస్తవ్యులు ఆనంద్‌కుమార్‌ కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. కార్యక్రమంలో కార్యనిర్వహణాధికారి వి.గిరికృష్ణ, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

శోభాయమానం

పుష్పయాగం

సుమగంధాలతో పరిమళించిన బిలకూటం

బిట్రగుంట: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండబిట్రగుంట బిలకూట క్షేత్రంలో ప్రసన్న వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా సోమవారం రాత్రి నిర్వహించిన పుష్పయాగం శోభాయమానంగా సాగింది. వివిధ రాష్ట్రాల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన విశేష పుష్పాలతో అర్చకులు యాగం ప్రారంభించారు. మేలుజాతి గులాబీలు, తామర, చామంతి, జాజి, విరజాజి, కలువలు, పొన్న, పొగడ, సంపంగి, మల్లెలు, మరువం, దమనం, వట్టివేర్లు, హరిత, హరిద్ర, బిల్వ, కస్తూరి, కనకంబరాలు, మొగలిరేకులు, బంతి తదితర పూలతోపాటు స్వామివారికి అత్యంత ప్రీతికరమైన తులసీ దళాలతో నేత్రపర్వంగా పుష్పయాగం నిర్వహించారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన యాగంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

What’s your opinion

Advertisement