రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టిన బవుమా | SA VS AUS 2nd Test: Temba Bavuma Breaks Rohit Sharma Record | Sakshi
Sakshi News home page

రోహిత్‌ శర్మ రికార్డును బద్దలు కొట్టిన బవుమా

Oct 21 2026 8:27 AM | Updated on Oct 21 2026 8:27 AM

SA VS AUS 2nd Test: Temba Bavuma Breaks Rohit Sharma Record

గెబెర్హా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికా స్కిప్పర్‌ టెంబా బవుమా చెలరేగిపోయాడు. జట్టు పీకల్లోతు కష్టాల్లో (110-6) ఉన్నప్పుడు వీరోచిత సెంచరీ (179)తో కదంతొక్కాడు. టెయిలెండర్లు మార్కో యాన్సెన్‌ (85), సైమన్‌ హార్మర్‌ (82)తో కలిసి భారీ భాగస్వామ్యాలు (132, 182) నెలకొల్పి, జట్టుకు భారీ స్కోర్‌ (425-9 డిక్లేర్‌) అందించాడు.

ఈ క్రమంలో పలు వ్యక్తిగత రికార్డులు సాధించాడు. గెబెర్హాలోని సెయింట్‌ జార్జ్స్‌ పార్క్‌లో టెస్టు సెంచరీ చేసిన తొలి సౌతాఫ్రికా కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు. అలాగే వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మార్క్రమ్(4) రికార్డును సమం చేశాడు. అతడి కెరీర్‌లోని 5 టెస్టు సెంచరీలలో 4 సెంచరీలు డబ్ల్యూటీసీ మ్యాచ్‌లోనే రావడం మరో విశేషం.

రోహిత్‌ రికార్డు బద్దలు
పై రెండు రికార్డులే కాక బవుమా మరో రికార్డు బద్దలు కొట్టాడు. వరల్డ్‌ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఆస్ట్రేలియాపై శతకం బాదిన అత్యంత పెద్ద వయసున్న (26 ఏళ్ల 154 రోజులు) కెప్టెన్‌గా నిలిచాడు. ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును (35 ఏళ్ల 285 రోజులు) అధిగమించాడు. ఓవరాల్‌గా డబ్ల్యూటీసీ చరిత్రలో సెంచరీ చేసిన అతి పెద్ద వయసున్న కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ (36 ఏళ్ల 312 రోజుల వయసులో ఇంగ్లండ్‌పై 103 పరుగులు) కొనసాగుతున్నాడు.

మ్యాచ్‌ విషయానికొస్తే.. 100 పరుగులు కూడా చేయడం కష్టమనుకున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఏకంగా 425 పరుగులు చేసి, అనూహ్యమైన పురోగతి సాధించింది. టెంబా, యాన్సెన్‌, హార్మర్‌ సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌కు పునరుజ్జీవం ఇచ్చారు. ఆసీస్‌ బౌలర్లలో స్కాట్‌ బోలాండ్‌ 5 వికెట్లు తీయగా.. స్టార్క్‌ 3, లబూషేన్‌ ఓ వికెట్‌ పడగొట్టాడు. 

అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన ఆసీస్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 3 పరుగులు చేసింది. మ్యాడిసన్‌ (0)ను రబాడ పెవిలియన్‌కు పంపగా.. హెడ్‌ (1), ఓవర్‌నైట్‌ ప్లేయర్‌ బోలాండ్‌ (2) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఆసీస్‌ ఇంకా 422 పరుగులు వెనుకపడి ఉంది.

ఈ మ్యాచ్‌ తొలి రెండు రోజులు వర్షం​ కారణంగా కనీస ఓవర్లు కూడా సాధ్యపడలేడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఆసీస్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. 

ఇదీ చదవండి: ఆల్‌రౌండర్‌ షోతో ఇరగదీసిన పాక్‌ ప్లేయర్‌


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement