చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. వరల్డ్‌కప్ చరిత్రలోనే | Quinton de Kock now has the highest score for a designated wicketkeeper in World Cup history | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన క్వింటన్‌ డికాక్‌.. వరల్డ్‌కప్ చరిత్రలోనే

Oct 24 2023 5:41 PM | Updated on Oct 24 2023 5:48 PM

 Quinton de Kock now has the highest score for a designated wicketkeeper in World Cup history - Sakshi

వన్డే ప్రపంచకప్‌-2023లో ద‍క్షిణాఫ్రికా స్టార్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. తన కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్‌ ఆడుతున్న డికాక్‌ సెంచరీల మోత మోగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ముంబై వేదికగా బంగ్లాదేశ్‌పై డికాక్‌ విధ్వంసకర శతకంతో చెలరేగాడు. బంగ్లాదేశ్ బౌలర్లను డికాక్‌ ఊచకోత కోశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభంలో కాస్త ఆచతూచి ఆడిన క్వింటన్‌.. మిడిల్ ఓవర్లలో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 

 ఈ మ్యాచ్‌లో 140 బంతులు ఎదుర్కొన్న డికాక్‌.. 15 ఫోర్లు, 7 సిక్స్‌లతో 174 పరుగులు చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో డికాక్‌కు ఇది మూడో సెంచరీ కావడం విశేషం. అదేవిధంగా ఇది వన్డేల్లో అతడికి రెండో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ కావడం గమానార్హం.

డి​కాక్‌ అరుదైన రికార్డు..
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన డికాక్‌ ఓ అరుదైన ఘనతను తన పేరిటి లిఖించుకున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు.

ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా దిగ్గజ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఆడమ్‌ గిల్‌క్రిస్ట్‌ పేరిట ఉండేది. 2007 వన్డే వరల్డ్‌కప్‌లో శ్రీలంకతో జరిగిన ఫైనల్లో గిల్‌క్రిస్ట్‌ 149 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో గిల్‌క్రిస్ట్‌ రికార్డును డికాక్‌(174) బ్రేక్‌ చేశాడు. 
చదవండి: నిజంగా సిగ్గు చేటు.. రోజూ 8 కేజీల మటన్‌ తింటున్నట్టు ఉన్నారు: పాకిస్తాన్‌ లెజెండ్‌ ఫైర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement