Pro Kabaddi League: అయ్యో.. మళ్లీ ఓడిన తెలుగు టైటాన్స్‌.. అదరగొట్టిన అజింక్యా

Pro Kabaddi League: Tamil Thalaivas Beat Telugu Titans 43 25 - Sakshi

Pro Kabaddi League: - బెంగళూరు: ఈ సీజన్‌ ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌)లో తెలుగు టైటాన్స్‌ చెత్త ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. ‘టై’ లేదంటే ఓటమితో పదేపదే నిరాశపరుస్తోన్న తెలుగు జట్టు గురువారం జరిగిన మరో మ్యాచ్‌లోనూ పరాజయం పాలైంది.

తమిళ్‌ తలైవాస్‌తో జరిగిన ఈ పోరులో తెలుగు టైటాన్స్‌ 25–43 స్కోరుతో ఓడిపోయింది. టైటాన్స్‌ జట్టులో గల్లా రాజు (9 పాయింట్లు) రాణించాడు. తలైవాస్‌ జట్టులో రెయిడర్‌ అజింక్యా పవార్‌ 10 పాయింట్లు సాధించాడు. ఇంతవరకు ఒక్కటే మ్యాచ్‌ గెలిచిన టైటాన్స్‌ జట్టు 11 మ్యాచ్‌ల్లో ఓడి 3 మ్యాచ్‌లను ‘టై’ చేసుకుంది.  

చదవండి: Yash Dhull: యశ్‌ ధుల్‌ ఎలా కొట్టావయ్యా ఆ సిక్స్‌.. క్రికెట్‌ పుస్తకాల్లో పేరుందా!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top