ఫైనల్లో  ప్రణయ్‌  | Pranay in the finals in Australian Open Badminton | Sakshi
Sakshi News home page

ఫైనల్లో  ప్రణయ్‌ 

Aug 6 2023 2:24 AM | Updated on Aug 6 2023 2:24 AM

Pranay in the finals in Australian Open Badminton  - Sakshi

సిడ్నీ: భారత స్టార్‌ షట్లర్‌ హెచ్‌.ఎస్‌.ప్రణయ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ టైటిలే లక్ష్యంగా ఫైనల్లోకి ప్రవేశించాడు.  బీడబ్ల్యూఎఫ్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 బ్యాడ్మింటన్‌ టోరీ్నలో భారత షట్లర్ల మధ్యే జరిగిన సెమీఫైనల్లో ప్రణయ్‌ వరుస గేముల్లో విజయం సాధించాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ సెమీస్‌లో 31 ఏళ్ల ప్రణయ్‌ 21–18, 21–12తో సహచరుడు ప్రియాన్షు రజావత్‌పై అలవోక విజయం సాధించాడు.

ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ప్రపంచ 9వ ర్యాంకర్‌ ప్రణయ్‌... చైనాకు చెందిన వెంగ్‌ హాంగ్‌యంగ్‌తో తలపడతాడు. మరో సెమీస్‌లో 24వ ర్యాంకర్‌ హాంగ్‌యంగ్‌ 21–19, 13–21, 21–13తో మలేసియాకు చెందిన 17వ ర్యాంకర్‌ లీ జి జియాపై పోరాడి గెలిచాడు.

కాగా హాంగ్‌యంగ్‌పై భారత ఆటగాడికి టైటిల్‌ గెలిచిన అనుభవం వుంది. గత మేలో కౌలాలంపూర్‌లో జరిగిన మలేసియన్‌ మాస్టర్స్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌లో అతన్ని ఓడించే ప్రణయ్‌ విజేతగా నిలిచాడు. ఈ సీజన్‌లో రెండో టైటిల్‌పై కన్నేసిన భారత షట్లర్‌ ఇపుడు అడుగు దూరంలో ఉన్నాడు. 

Advertisement
 
Advertisement
Advertisement