వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైర‌ల్‌ | MS Dhoni Rolls Back The Clock With Vintage Stumping | Sakshi
Sakshi News home page

#MS Dhoni: వారెవ్వా ధోని..కళ్లు మూసి తెరిచేలోపే! వీడియో వైర‌ల్‌

Mar 28 2025 8:55 PM | Updated on Mar 28 2025 10:10 PM

MS Dhoni Rolls Back The Clock With Vintage Stumping

Photo Courtesy: BCCI/IPL

టీమిండియా మాజీ కెప్టెన్‌, చెన్నై సూప‌ర్ కింగ్స్ దిగ్గ‌జం ఎంఎస్ ధోని మ‌రోసారి వికెట్ల వెన‌క అద్బుతం చేశాడు. ఐపీఎల్‌-2025లో భాగంగా చెపాక్ వేదిక‌గా రాయ‌ల్స్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుతో జ‌రుగుతున్న మ్యాచ్‌లో ధోని సంచ‌ల‌న స్టంపింగ్‌తో మెరిశాడు. మిస్ట‌ర్ కూల్ మెరుపు స్టంపింగ్‌తో ఆర్సీబీ ఓపెన‌ర్ ఫిల్ సాల్ట్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు.

ఆర్సీబీ ఇన్నింగ్స్ ఐదో ఓవ‌ర్ వేసిన స్పిన్న‌ర్ నూర్ ఆహ్మ‌ద్‌.. ఆఖ‌రి బంతిని సాల్ట్‌కు గూగ్లీగా సంధించాడు. ఆ బంతిని సాల్ట్ ఫ్రంట్ ఫుట్‌కు వ‌చ్చి భారీ షాట్ ఆడేందుకు ప్ర‌య‌త్నించాడు. కానీ బంతి సాల్ట్ బ్యాట్‌ను మిస్స్ అయ్యి వికెట్ల వెన‌క ఉన్న ధోని చేతికి వెళ్లింది. వెంట‌నే ధోని రెప్ప‌ పాటు వేగంతో స్టంప్స్‌ను గిరాటేశాడు. 

ఫీల్డ్ అంపైర్ థ‌ర్డ్ అంపైర్‌కు రిఫ‌ర్ చేసిన‌ప్ప‌టికి.. ధోని స్టంప్స్‌ను ప‌డ‌గొట్టేట‌ప్ప‌టికి సాల్ట్ బ్యాక్‌ఫుట్ గాల్లో ఉన్న‌ట్లు రిప్లేలో క‌న్పించింది. దీంతో సాల్ట్‌(32) నిరాశ‌తో పెవిలియ‌న్‌కు చేర‌క త‌ప్ప‌లేదు. ధోని స్టంపింగ్‌కు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. అంత‌కుముందు ముంబై ఇండియ‌న్స్‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఈ త‌ర‌హాలోనే సూర్య‌కుమార్ యాద‌వ్‌ను పెవిలియ‌న్‌కు పంపాడు. 

ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆర్సీబీ 7 వికెట్ల న‌ష్టానికి 196 ప‌రుగులు చేసింది. ఆర్సీబీ బ్యాట‌ర్ల‌లో ర‌జిత్ పాటిదార్‌(51) కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడ‌గా.. ఫిల్ సాల్ట్‌(32), విరాట్ కోహ్లి(31), ప‌డిక్క‌ల్‌(27) రాణించారు. ఆఖ‌రి ఓవ‌ర్‌లో టిమ్ డేవిడ్‌( 8 బంతుల్లో 1ఫోర్లు, 3 సిక్స్‌ల‌తో 22) మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే బౌల‌ర్ల‌లో నూర్ ఆహ్మ‌ద్ మూడు వికెట్లు ప‌డ‌గొట్ట‌గా.. ప‌తిరానా రెండు, ఖాలీల్ అహ్మ‌ద్‌, అశ్విన్ త‌లా వికెట్ సాధించారు

 

 

Advertisement
 
Advertisement
Advertisement