Mother's Day: వైరలవుతున్న క్రికెటర్ల పోస్టులు | Mothers Day: Special Wishes From Cricketers Their Lovable Mothers Viral | Sakshi
Sakshi News home page

Mother's Day: వైరలవుతున్న క్రికెటర్ల పోస్టులు

May 9 2021 7:50 PM | Updated on May 9 2021 8:52 PM

Mothers Day: Special Wishes From Cricketers Their Lovable Mothers Viral - Sakshi

ముంబై: కన్నతల్లి అంటే ఎవరికి ప్రేమ ఉండదు చెప్పండి. మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయేవరకు ఏ ప్రేమకైనా దూరంగా ఉంటాడేమో కానీ కన్నతల్లి ప్రేమ నుంచి దూరంగ ఉండలేడు. తన సంతోషం కన్నా బిడ్డల సంతోషాన్ని కోరుకునే గొప్ప మానవతావాది అమ్మ. అందుకే ప్రపంచంలో అమ్మ ఎవరికైనా అమ్మే.. ఆ విషయంలో క్రికెటర్లు కూడా ఒక్కటే. ఎంత గొప్ప పేరు సంపాదించినా తల్లి ముందు మాత్రం తాను ఎప్పటికీ పిల్లాడే.

మే 9వ తేదీ.. మదర్స్‌డే పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెటర్లు తమ తల్లులకు శుభాకాంక్షలు తెలుపుతూ వారి దీవెనలు అందుకున్నారు. ఈ సందర్భంగా భారత లెజండరీ క్రికెటర్‌ సచిన్ టెండూల్కర్‌ మొదలుకొని సెహ్వాగ్​, రహానె, సురేశ్‌ రైనా, శిఖర్‌ ధావన్, దినేశ్‌ కార్తీక్‌, విరాట్‌ కోహ్లీ, క్రిస్‌గేల్‌, దినేశ్‌ చండిమాల్‌, డేవిడ్‌ వార్నర్‌ తదితరులు తమ తల్లులతో ఉన్న అనుబంధాలను.. తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ ఫొటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం వాటికి సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. వీలైతే మీరు ఒకసారి లుక్కేయండి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement