IND vs WI, 5th T20: India Won The Toss And Choose To Bat - Sakshi
Sakshi News home page

IND VS WI 5th T20: టాస్‌ గెలిచిన టీమిండియా.. అదే జట్టుతో బరిలోకి..!

Aug 13 2023 7:45 PM | Updated on Aug 14 2023 9:53 AM

IND VS WI 5th T20: India Won The Toss And Choose To Bat - Sakshi

5 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఫ్లోరిడా వేదికగా విండీస్‌తో ఇవాళ (ఆగస్ట్‌ 13) జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టీ20లో టీమిండియా టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లు ఓడిపోయి 0-2తో వెనుకపడిన భారత్‌.. ఆతర్వాత అనూహ్యంగా పుంజుకుని మూడు, నాలుగు మ్యాచ్‌లు గెలిచి 2-2తో సిరీస్‌లో సమంగా నిలిచింది. చివరిదైన ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంటుంది. 

నాలుగో మ్యాచ్‌లో బరిలోకి దిగిన జట్టునే టీమిండియా యధాతథంగా కొనసాగించగా..  విండీస్‌ ఓ మార్పు చేసింది. ఒబెద్‌ మెక్‌కాయ్‌ స్థానంలో అల్జరీ జోసఫ్‌ బరిలోకి దిగాడు.

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): కైల్ మేయర్స్, బ్రాండన్ కింగ్, షాయ్‌ హోప్‌, నికోలస్ పూరన్, షిమ్రాన్ హెట్మెయర్, రోవ్‌మన్ పావెల్ (సి), జేసన్‌ హోల్డర్‌, రోస్టన్‌ ఛేజ్‌, రొమారియో షెపర్డ్, అకీల్ హోసేన్, అల్జరీ జోసెఫ్

భారత్ (ప్లేయింగ్ XI): శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్‌, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా(c), సంజు శాంసన్, అక్షర్ పటేల్, కుల్దీప్‌ యాదవ్‌, యుజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, ముఖేష్ కుమార్

Advertisement
 
Advertisement
Advertisement